అభివృద్ధకి ప్రభుత్వం పెద్దపీట

Oct 25, 2020 , 00:51:03

  • ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు
  •  ఎమ్యెల్యే డాక్టర్‌ లక్ష్మారెడ్డి

మిడ్జిల్‌ : ప్రభుత్వం సంక్షేమంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నదని ఎమ్యెల్యే డాక్టర్‌ లక్ష్మారెడ్డి అన్నారు. శనివారం మండలంలో  రూ.30లక్షలతో వేసిస సీసీ రోడ్డు, రూ.10లక్షలుతో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ లై టింగ్‌ పనులను ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభు త్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు నూతనంగా గ్రామాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేస్తామన్నారు. మల్లాపూర్‌ లో దేవీనవరాత్రుల ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్యెల్యేతోపాటు మండల ప్రజాప్రతినిధులను ఘ నంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎం పీపీ కాంతమ్మ, జడ్పీటీసీ శశిరేఖ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పాండు, సర్పంచ్‌ రాధికారెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

ఆలయాల్లో ప్రత్యేక పూజలు 

జడ్చర్ల టౌన్‌ : దసరా పండుగ సందర్భం గా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. శనివారం రాత్రి జడ్చ ర్ల పట్టణంలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయం, నిమ్మబావిగడ్డ ఆంజనేయస్వామి ఆలయం, చైతన్యనగర్‌లోని బంగారు మైసమ్మ ఆలయాల్లో అమ్మవారికి ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎ మ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరూ సు:ఖ సంతోషాలతో దసరా పండుగను చేసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తలు పాటిస్తూ దసరా పం డుగను జరుపుకోవాలని సూచించారు.

వీరశివాజీనగర్‌లో తాగునీటి బోరు ప్రారంభం

మున్సిపల్‌లోని వీరశివాజీనగర్‌కాలనీ ప్రజలకు తాగునీటి సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బోరు మోటర్‌ను ఎమ్మె ల్యే ప్రారంభించారు. బోరు వేయించి కాలనీ ప్రజలకు తా గునీటి సదుపాయం కల్పించడంపై కాలనీవాసులు ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు. వేర్వేరు కార్యక్రమాల్లో తెలంగాణ సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌ శివకుమార్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ యాదయ్య, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ప్రభాకర్‌రెడ్డి, మార్కెట్‌ కమిటీ నూతన చైర్మన్‌ లక్ష్మయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ సునీత, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD