మంగళవారం 01 డిసెంబర్ 2020
Narayanpet - Oct 25, 2020 , 00:54:32

సమస్యలు తలెత్తకుండా ఉండాలి

సమస్యలు తలెత్తకుండా ఉండాలి

నారాయణపేట : శాంతిభద్రతల సమస్య లు తలెత్తకుండా ఉండాలని ఎస్పీ డాక్టర్‌ చేత న అన్నారు. పట్టణంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో శనివారం ఎస్పీ ఆయుధ, వాహన పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా చేతన మాట్లాడుతూ శక్తికి ప్రతీకగా నిలిచే దుర్గామాత సమక్షంలో ప్రతి ఆయుధానికి ఎంతో శక్తి కలిగి ఉందన్నారు. జిల్లాలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండాలని, ప్ర జలంతా ఆయురారోగ్యాలు, సు:ఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రతి అధికారి ప్ర జారక్షణలో ముందుంటూ, ప్రజా అభిమానం పొందాలన్నారు. విజయదశమి పర్వదినాన్ని ప్రజలందరూ ఆనందంగా నిర్వహించుకోవాలన్నారు. అదనపు ఎస్పీ భరత్‌, ఆర్‌ఐ కృష్ణయ్య, ఆర్‌ఎస్సై నరసింహా, సిబ్బంది పాల్గొన్నారు.