బుధవారం 25 నవంబర్ 2020
Narayanpet - Oct 23, 2020 , 02:16:33

పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకోవాలి

పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేసుకోవాలి

నారాయణపేట టౌన్‌ : ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేసేలా ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్‌ హరిచందన అధికారులను ఆదేశించారు. గురువారం పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయంలో వ్యవసా య మార్కెటింగ్‌, సీసీఐ అధికారులతో ఏర్పాటు చేసిన స మావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఉన్న గోడౌన్‌ల వివరాలు ఇవ్వాలన్నారు. 2020-21కి గానూ పత్తి పంట కు కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.5.825గా ఉందన్నారు. రైతులు పత్తి తేమ శాతం తక్కువగా ఉండేలా చూ డాలని సూచించారు. పత్తి కొనుగోలు సమయంలో సం బంధిత రైతు తప్పనిసరిగా ఉండాలన్నారు. పత్తిని మాత్ర మే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, పత్తికి సగటు నా ణ్యతా ప్రమాణాలు కలిగి ఉంటే మంచి ధర లభిస్తుందని ఆమె వివరించారు. రైతులు పత్తిని మార్కెట్‌ యార్డుకు ఒకేసారి రాకుండా దశల వారీగా తీసుకురావాలని సూచించారు. మార్కె ట్‌ యార్డుకు వచ్చే ప్రతి రైతు గుర్తింపు కార్డు, పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాం కు ఖాతా పూర్తి వివరాలతో జిరాక్స్‌ కాపీలు తీసుకురావాలన్నారు. అన్ని మండలాల ఏఈవోలను ఉంచి టోకెన్లు ఇచ్చే ఏర్పాట్లు చేయాలన్నారు. సీసీఐ వారి చెల్లింపులను రైతుల ఖా తాకే చెల్లించాలన్నారు. సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసులు, జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌సుధాకర్‌, సీసీఐ కమర్షియల్‌ అధికారి రాజశేఖర్‌, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

వరద బాధితులకు సహాయం...

హైదరాబాద్‌లో వరద బాధితుల సహాయార్థం కలెక్టర్‌ హరిచందనకు పట్టణంలోని సంతోషమ్మ ద వాఖానకు చెందిన డాక్టర్‌ కరుణాకర్‌ 35 కిలోల బియ్యం, మందులను అందజేశారు. కార్యక్రమంలో దవాఖాన సిబ్బంది పాల్గొన్నారు. 

మొక్కలు నాటాలి

నారాయణపేట రూరల్‌ : మండలంలోని ఎక్లాస్‌పూర్‌లో 200 ఎకరాల స్థలంలో నూతనంగా ఏర్పా టు చేస్తున్న ఎకో పార్క్‌ స్థలంలో కలెక్టర్‌ హరిచందన, జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి మొక్కలు నాటారు. పార్క్‌లో 75 ఎకరాలలో వివిధ రకాల మొక్కలు పెట్టడంతోపాటు రోడ్డు వెంట 440 మొక్కలు నాటడం జరిగిందని అధికారులు తెలిపారు. పిల్లలు ఆడుకోవడానికి పార్క్‌, పార్క్‌లో వాటర్‌ ఫాల్స్‌ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. అలాగే జింకల పార్కును కూడా ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ అంజలి, మున్సిపాల్‌ చైర్‌పర్సన్‌ అనసూయ, వైస్‌ చైర్మన్‌ హరినారాయణభట్టడ్‌, సర్పంచ్‌ జమునబాయి, ఫారెస్ట్‌ అధికారి నారాయణరావు పాల్గొన్నారు.