సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Oct 22, 2020 , 02:27:07

వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

నారాయణపేట టౌన్‌: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు జిల్లా కేంద్రంలో వైభవంగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని పలు అమ్మవారి ఆలయాల్లో దేవతా విగ్రహాలను వివిధ రూపాల్లో అలంకరించి కుంకుమార్చన తదితర పూజలు చేశారు. శ్రీసంత్‌ మఠ మూలసంస్థానం శక్తిపీఠంలో వెలసిన మహాలక్ష్మి లలితా త్రిపుర సుందరి అలంకరణలో, అశోక్‌నగర్‌లోని మల్లాంబిక ఆలయంలో అమ్మవారు అలంపూర్‌ జోగుళాంబదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. వాసవీ కన్యకాపరమేశ్వరీ ఆలయంలో వాసవీమాత శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకరణలో దర్శనమిచ్చారు.

గాయత్రీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

నారాయణపేట రూరల్‌: పేట మండలంలోని కోటకొండ గ్రామంలోని నగరేశ్వర ఆలయంలో బుధవారం అమ్మవారిని గాయత్రీదేవిగా అలంకరించి ప్రత్యేకపూజలు చేశారు. సింగారం గ్రామంలోని భవానీమాతను సరస్వతీదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. 

కృష్ణ మండల కేంద్రంలో..

కృష్ణ: శరన్నవరాత్రుల సందర్భంగా బుధవారం మండల కేంద్రంలో 5వ రోజు దుర్గామాత మంటపంలో వామన అలంకరణతో అమ్మవారు భక్తులకు దర్శనిమిచ్చారు. శోడశోపచారాలతో గ్రామ  ప్రజలు ఘనంగా పూజించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు సింగ్‌, నాగేశ్‌, శంకర్‌నాయక్‌, కృష్ణ, వెంకటేశ్‌,  సభ్యులు పాల్గొన్నారు.

VIDEOS

logo