శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Oct 21, 2020 , 02:56:21

భూమి క్రమబద్ధీకరణకు అవకాశం

భూమి క్రమబద్ధీకరణకు అవకాశం

నారాయణపేట టౌన్‌ : చిన్న, సన్నకారు రైతులు 14 కన్న ముందు తెల్ల కాగితంపై రాసుకొని వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన వారి భూమి క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 ఎకరాల కన్నా తక్కువ భూ మి ఉన్న రైతులకు స్టాంప్‌డ్యూటీ, మార్కెట్‌ వాల్యూ లేకుండా జీవో నంబర్‌ 112 రెవెన్యూ అసైన్‌మెంట్‌ డిప్మాంట్‌ ద్వారా ప్రభుత్వం వెసులుబాటు కల్పించిందన్నారు. లబ్ధిదారులు ఈ నెల 31వ తేదీలోగా మీ సేవాలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. సాదాబైనామా డాక్యుమెంట్‌, ఆధార్‌ కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం తదతర వాటిని సమర్పించి ప్రత్యేక ప్రొఫార్మాలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 5 ఎకరాలకు మించి ఉన్న వారికి స్టాంప్‌ డ్యూటీ, మార్కెట్‌ వాల్యూ మినహాయింపు లేదన్నారు. రెగ్యులరైజేషన్‌ తదుపరి విధివిధానాలు ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాత తెలియజేస్తామన్నారు. 

VIDEOS

logo