ఆదివారం 29 నవంబర్ 2020
Narayanpet - Oct 21, 2020 , 02:56:19

వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం

 వివిధ రూపాల్లో అమ్మవారి దర్శనం

నారాయణపేట రూరల్‌ : అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవా లు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మండల కేంద్రంలో ని ప్రధాన ఆలయాన్నింటిలోనూ అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహిస్తున్నారు. మంగళవారం అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. మండలంలోని ఎక్లాస్‌పూర్‌లో లోకపల్లి లక్ష్మమ్మమాత అన్నపూర్ణాదేవిగా దర్శనమిచ్చారు. సిం గారం భవానీమాత, శేర్నపల్లి, జాజాపూర్‌ గ్రామాల్లోని అమ్మవారిని గౌరీదేవిగా ప్రత్యేక అలంకరణ చేపట్టి పూజలు చేపట్టా రు. అదేవిధంగా ప్రత్యేక అభిషేకాలు, విశిష్ట పూజలతో, కుంకుమార్చనలతో అమ్మవార్లను కొలిచి మొక్కులు చెల్లించుకొని తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. ఆయా ఆలయాల్లో మహిళలు , భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.

పోలెపల్లిలో హోమాలు

కోస్గి : పోలెపల్లి ఎల్లమ్మ ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని హోమాలను నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఎల్లమ్మ తల్లిని లలితాత్రిపురసుందరీదేవిగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను భక్తులు నిర్వహిస్తున్నట్లు కమి టీ సభ్యులు తెలిపారు.

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

నారాయణపేట టౌన్‌ : శరన్నవరాత్రి ఉత్సవాలను జిల్లా కేం ద్రంలో ఘనంగా జరుపునకుంటున్నా రు. అమ్మవారి విగ్రహాలను వివిధ రూ పాల్లో అలంకరణలు చేపట్టారు. అంబాభవాని, చౌడేశ్వరిమాత ఆలయాల్లో భ క్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని శక్తిపీఠంలో మహాలక్ష్మి అమ్మవారు కాత్యాయనిదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. కన్యకాపరమేశ్వరి ఆలయంలో వాసవీమాత అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చా రు. అశోక్‌నగర్‌లోని మల్లాంబికాదేవి ఆలయంలో అమ్మవారు విజయవాడ కనకదుర్గమ్మ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.   

భౌతిక దూరం పాటించాలి

కృష్ణ : భౌతిక దూరం పాటిస్తూ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించుకోవాలని ఎస్సై మురళి అన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించాలన్నారు. డిజేలకు అనుమతి లేదని, అంతేకాకుండా వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఙప్తి చేశారు.

గంగామాత ఆలయంలో...

ధన్వాడ : మండల కేంద్రంలో నవరాత్రి ఉత్సవాలను ఘనం గా నిర్వహించారు. గంగామాత ఆలయంలో అమ్మవారికి ప్రత్యే క పూజలు చేపట్టారు. మత్స్యసహకార సంఘం అధ్యక్షుడు న ర్సింహులు నాయుడు కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా అం బాభవానీమాత ఆలయం, దత్తాత్రేయ ఆలయంలో నవరాత్రి పూజలు నిర్వహించారు.

అన్నపూర్ణాదేవిగా అమ్మవారు

మరికల్‌ : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు భక్తులు అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. మండల కేంద్రంలోని పాత కుర్వగేరి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యాక్రమాలు చేపట్టారు. కాళికాదేవి ఆలయం, అప్పంపల్లి, జిన్నారం, ఏలిగండ్ల గ్రామాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్ధప్రసాదాలను పం పిణీ చేశారు.

వరహాస్వామి అవతారంలో శ్రీనివాసుడు

మక్తల్‌ రూరల్‌ : పట్టణంలో బ్రహ్మణవాడిలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసా గుతున్నాయి. అదేవిధంగా బ్రహ్మోత్సవాల్లో భాగంగా వేంకటేశ్వర స్వామి వారు వరహాస్వామి అవతారంలో దర్శనమిచ్చారు. అనంతరం కల్పవృక్ష వాహనంపై ఊరేగించారు. భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో వేదపండితులు శ్యామ్‌సుందర్‌చారి, విద్యాసాగర్‌, డీవీ చారి, వెంకటేశ్‌చారి, గోవింద్‌రావు పాల్గొన్నారు. 

భక్తిశ్రద్ధలతో...

ఊట్కూర్‌ : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భవానీ మందిరం, బిజ్వారం దుర్గామాత ఆలయంలో భక్తులు అమ్మ వారిని భక్తి శ్రద్ధలతో కొలిచారు. ఆలయ పూజారులు ఆదిత్యపరాశ్రీ ఆధ్వర్యంలో అభిషేకం, మంగళహారతి, అష్టోత్రాలు, సహస్రనామం, కుంకుమ పూజలను నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు జగన్నాథ్‌రావు, మహేశ్‌గౌడ్‌, కృష్ణ య్య, అశోక్‌ పాల్గొన్నారు.

దర్గామాతకు పూజలు

మిడ్జిల్‌ : మండంలోని మల్లాపూర్‌, వేముల, వల్లబురావుపల్లి, దోనర్‌ గ్రామాల్లో దుర్గామాతకు పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు పాండు, శ్రీనివాస్‌గుప్త, బంగారు, నవీనాచారి, సత్యం పాల్గొన్నారు.