గురువారం 22 అక్టోబర్ 2020
Narayanpet - Oct 18, 2020 , 01:02:43

తాసిల్దార్లకు పూర్తి స్థాయిలో శిక్షణ అందించాలి

తాసిల్దార్లకు పూర్తి స్థాయిలో శిక్షణ అందించాలి

  • వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌

నారాయణపేట టౌన్‌ : తాసిల్దార్లకు పూర్తి స్థాయిలో శి క్షణ అందించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ కలెక్టర్‌ను ఆదేశించారు. శనివారం వీడియో కాన్ఫరెన్స్‌లో ధరణి పోర్టల్‌ ఏ విధంగా పని చేస్తున్నది, అందులో సిటిజ న్‌ పాత్ర ఏమిటి, తాసిల్దార్ల పాత్ర ఏమిటి అనే అంశాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. ఈ నె ల 25న ధరణి పోర్టల్‌ ప్రారంభించబోతున్నందున అప్పటి లోగా తాసిల్దార్లు, డిప్యూటీ తాసిల్దార్లకు పూర్తి స్థాయిలో శి క్షణ అందించడంతో పాటు తాసిల్దార్‌ కార్యాలయంలో ధర ణి ఆన్‌లైన్‌ సేవలకు సకల సదుపాయాలు ఉండే విధంగా చూడాలని కలెక్టర్‌కు సూచించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ వ్యవసాయ భూములకు సంబంధించిన వివరాలు, వ్యవసాయేతర భూములకు సంబంధించిన వి వరాలను అత్యంత పారదర్శకంగా, కచ్చితత్వం, నమ్మకం గా, సరళమైన పద్ధతిలో క్రయవిక్రయాలు, ఆస్తి మార్పిడి చేసుకోవడానికి సీఎం కేసీఆర్‌ ధరణి పోర్టల్‌ను తీసుకురావడం జరుగుతుందని స్పష్టం చేశారు. ధరణి పోర్టల్‌ ద్వారా ఏ విధంగా క్రయ విక్రయాలు చేయాలి, మ్యుటేషన్‌ ఎలా చేయాలి అనే విషయాలను తాసిల్దార్లు, డిప్యూటీ తాసిల్దార్లు ప్రాక్టీస్‌ చేసి రేపు సాయంత్రం లోగా ప్రతి తాసిల్దార్‌ 10 చొప్పున నమూనా క్ర యవిక్రయాలు చేసి నిర్ణీత ప్రొఫార్మాలో పొందుపరిచి పంపించాలని ఆదేశించారు.  వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు రి జిస్టర్‌ సమయంలో నిమిషం అలస్యం కా కుండా మ్యుటేషన్‌ పూర్తి అయ్యే విధంగా ధ రణిలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పార్టీషన్లు, సక్సేషన్లు, నాలా మార్పిడి తదితర సేవలు ప్రజలు సులభంగా చేయించుకునేలా ధరిణిని తయారు చేశామన్నారు. అనంతరం కలెక్టర్‌ హరిచందన మాట్లాడుతూ జిల్లాలోని తాసిల్దార్లు, డిప్యూటీ తాసిల్దార్లకు ఆన్‌లైన్‌ పోర్టల్‌పై శిక్షణ కల్పించి, నివేదికలు పంపిస్తామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

మ్యుటేషన్లపై అవగాహన కలిగి ఉండాలి

రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లపై తాసిల్దార్లు, డిప్యూటీ తాసిల్దార్లు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ హరిచందన అన్నారు. శనివారం పట్టణంలోని కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లాలోని తాసిల్దార్లు, డిప్యూటీ తాసిల్దార్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ధరణి పోర్టల్‌లో దరఖాస్తుదారు స్లాట్‌ బుకింగ్‌పై బాధ్యత వహించాలన్నా రు. పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉం డాలన్నారు. ధరిణి పోర్టల్‌ ద్వారా అందించే సేవలతో పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ఏవైనా సమస్యలు, అనుమానాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ చంద్రారెడ్డి, ఆర్డీవో శ్రీనివాసులు పాల్గొన్నారు. 


logo