Narayanpet
- Oct 17, 2020 , 05:39:07
VIDEOS
డిజిటల్ పేమెంట్స్‌పై అవగాహన

నారాయణపేట టౌన్ : వీధి విక్రయదారులు డిజిటల్ ద్వారా లావాదేవీలు నిర్వహించాలని మెప్మా పీడీ కృష్ణమాచారి సూచించారు. ప్రధాన మంత్రి ఆత్మనిర్బర్ నిధి పథకంలో భాగంగా శుక్రవారం మెప్మా ఆధ్వర్యంలో పట్టణంలోని వీధి విక్రయదారులకు డిజిటల్ పేమెంట్స్, క్యూ ఆర్ కోడ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. డిజిటల్ లావాదేవీలు ఏ వి ధంగా నిర్వహించాలి, క్యూ ఆర్ కోడ్ గురించి, డిజిటల్ లావాదేవీలు జరుపడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. అర్హులైన వీధి విక్రయదారులందరికీ ఆత్మనిర్బర్ నిధి పథకం ద్వారా రుణాలు అందిస్తామన్నారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, ఏడీఎంసీ శేషన్న, టీఎంసీ లక్ష్మి, వార్డు కౌన్సిలర్ అమీరొద్దీన్, ఆర్పీలు పాల్గొన్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING