సోమవారం 25 మే 2020
Narayanpet - Mar 10, 2020 , 00:09:31

రమణీయం.. రథోత్సవం

రమణీయం.. రథోత్సవం

పెబ్బేరు రూరల్‌ (శ్రీరంగాపురం) : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన రంగనాథుడు తన స తీమణులైన శ్రీదేవి, భూదేవిలతో కలిసి రథంలో ఊరేగిన ఘట్టం శ్రీరంగాపురం మండలకేంద్రంలోని రంగనాథస్వామి ఆలయంలో సోమవారం ఆవిష్కృతమైంది. తెలంగాణలోనే ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా భాసిల్లుతున్న రంగనాథస్వామి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్స వం కన్నుల పండువగా సాగింది. వేలాది మంది భక్తులు గోవిందనామ స్మరణతో ఉత్సవంలో పా ల్గొని తన్మయత్వం పొందారు. భాజాభజంత్రీలు, వేదమంత్రాల మధ్య శ్రీరంగ ఆలయం నుంచి ఉ త్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రత్యేకంగా అలంకరించిన రథంలో ఆశీనులను చేశా రు. అనంతరం భక్తులు కేరింతలు కొడుతూ రథా న్ని లాగి భక్తిపారవశ్యానికి లోనయ్యారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై రథోత్సవంలో పాల్గొన్నారు. ఆల య ధర్మకర్త, వనపర్తి రాజవంశీయుడైన రాజాకృష్ణదేవరావు పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రా రంభించారు. శ్రీరంగాపురం సేవా సమితి వారు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి, తన వంతుగా కొంత నగదును వి రాళంగా అందజేశారు. సుమారు ఐదు వేల మం ది భక్తులకు అన్నదానం చేశారు. వాలీబాల్‌ అసోసియేషన్‌ వారు తాగునీటి వసతిని కల్పించారు. అలాగే స్థానిక ట్రాక్టర్‌ అసోసియేషన్‌ వారు నిర్వహించిన ట్రాక్టర్‌ రివర్స్‌గేర్‌ పోటీలు ఆకట్టుకున్నా యి. రథోత్సవం అనంతరం శ్రీరంగాపురం జాత ర ప్రారంభమైంది. ఈ జాతర ఉగాది పర్వదినం వరకు కొనసాగనున్నది. వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్‌, కొత్తకోట సీఐ మల్లిఖార్జునరెడ్డి, స్థానిక ఎస్‌ఐ అబ్దుల్‌ఖాదర్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమానికి శ్రీరంగాపురం ఎంపీపీ గాయత్రి, జెడ్పీటీసీ రాజేంద్రప్రసాద్‌, సర్పంచ్‌ వినీలారాణి, సింగిల్‌ విండో అధ్యక్షులు జగన్నాథం, రామిరెడ్డి, పెబ్బేరు ఎంపీపీ శైలజ, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ కర్రెస్వామి, మార్కె ట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ బుచ్చారెడ్డి తదితరులు హాజరయ్యారు. 


logo