శనివారం 06 జూన్ 2020
Narayanpet - Mar 10, 2020 , 00:07:58

హోలీ.. ఆనందాల కేళీ

హోలీ.. ఆనందాల కేళీ

వనపర్తి సాంస్కృతికం/రూరల్‌/గోపాల్‌పేట/పెద్దమందడి : జిల్లా కేంద్రంలో కరోనా వైరస్‌ భయందోళనలు కలిగిస్తున్న వేళ.. హోలీ వేడుకల మీద కరోనా ప్రభావం కనిపించింది. జిల్లా కేంద్రంలో ప్రతి సంవత్సరం హోలీ సంబురాలు వైభవంగా జరిగేవి, ఈసారి ప్రపంచ వ్యాప్తంగా కరో నా వ్యాధి ప్రభావంతో చాలా చోట్ల హోలీ వేడుకలను ప్రత్యే క రంగులతో కాకుండా సహజ సిద్ధంగా తయారు చేసుకు న్న వాటితోనే హోలీ నిర్వహించుకున్నారు. కేవలం కలర్‌ పౌడర్లను మాత్రమే వాడారు. చాలా మంది అధికారులు, ప్రజాప్రతినిధులు హోలీకి దూరంగానే ఉన్నారు. ఈ సంబురాలను పట్టణంలో ఎక్కడో ఒక దగ్గర చిన్నారులు, మహిళాలు, యువత ఆడుకున్నారు. వనపర్తి మండలంలోని కడుకుంట్ల, పెద్దగూడెం, చిట్యాల, అంకూర్‌, నాచహళ్లి, సవాయిగూడెం, అప్పాయిపల్లి, రాజపేట గ్రామాలలో సోమవారం హోలీ సంబురాలను చిన్న, పెద్దలు, మహిళలు కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు. అలాగే గోపాల్‌పేట మండలంలో అన్ని గ్రామాల్లోని ప్రజలు హోలీ పండుగను ఆనందోత్సవాలతో జరుపుకున్నారు. చిన్నా పెద్దా తేడాలేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. హోలీ ముగించుకున్న యువకులు మధ్యాహ్నం సమీపంలోని చెరువుల వద్ద ఈతలు కొడుతూ కేరింతలు వేస్తూ కనిపించారు. ఎంపీపీ సంధ్య, జెడ్పీటీసీ భార్గవి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు బాల్‌రాజులు మండల ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా పెద్దమందడి మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో సోమవారం ప్రజలు హోలీ సంబురాలు ఘనంగా జరుపుకొన్నారు. హోలీ వేడుకల్లో రైతు సమన్వయ సమితీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి పాల్గొని యువకులలో జోష్‌ పెంచారు.


logo