సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Mar 10, 2020 , 00:00:55

‘దిశ’ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి

‘దిశ’ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి

మక్తల్‌రూరల్‌ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’ ఘటనలో నిందితుడుగా ఉన్న నారాయణపేట జిల్లా గు డిగండ్ల చెన్నకేశవులు తండ్రి జొల్లు కు ర్మయ్య(50) సోమవారం మృతి చెం దాడు. రెండు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే! హైదరాబాద్‌లోని నీమ్స్‌లో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లాడు. ఈ సంఘటన వివరాలు.. నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలం గుడిగండ్ల గ్రామానికి చెందిన జొల్లు కుర్మయ్య గత జనవరి 6న జక్లేర్‌ వద్ద బైక్‌ పై మక్తల్‌ నుంచి వెళ్తుతుండగా ఇన్నోవా వా హ నం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డా డు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. తలకు బలమైన గాయాలు కావడంతో రెండు నెలలపాటు చికిత్స చేశారు. అయితే కో మాలోకి వెళ్లడంతో పరిస్థితి మరింత వి షమించింది. మూడు రోజుల క్రితం కు ర్మయ్యను స్వగ్రామం గుడిగండ్లకు తీసుకొచ్చారు. సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో కుర్మయ్య మృతిచెందాడు. ఈ సంఘటనపై మక్తల్‌ పోలీసు స్టేషన్‌లో అతడి భార్య ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్సై అశోక్‌కుమార్‌ తెలిపారు. 

VIDEOS

logo