శుక్రవారం 05 జూన్ 2020
Narayanpet - Mar 09, 2020 , 00:48:11

కరాటేతో.. ఆత్మ రక్షణ

కరాటేతో.. ఆత్మ రక్షణ

పెబ్బేరు రూరల్‌ : కరాటేతో ఆత్మరక్షణే కాదు, శరీరదారుఢ్యం కూడా పెరుగుతుందని వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. పెబ్బేరు మార్కెట్‌ యార్డులో ఆదివారం తన తల్లి సింగిరెడ్డి తారకమ్మ స్మారకార్థం నిర్వహించిన రా ష్ట్రస్థాయి కరాటే పోటీల ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. పోటీలతో క్రీడాస్ఫూర్తి ఏర్పడుతుందన్నారు. కరాటే వల్ల ముఖ్యం గా ఆడపిల్లలు తమకెదురయ్యే ఉపద్రవాలను ఎ దుర్కోవచ్చని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ కరాటే అవసరమన్నారు. అందరితో క లిసి మెలిసి ఉంటే విజ్ఞానం పెరగడమే గాకుండా మానవ లక్షణాలు అలవడతాయన్నారు. ప్రస్తుతం పిల్లలు, పెద్దలు ఆటలను పక్కకు పెట్టి సెల్‌ఫోన్‌, టీవీల ముందు కూర్చుంటున్నారని, దీని వల్ల వా రికి ఎంతో నష్టం జరుగుతుందన్నారు. ప్రతి ఒ క్కరూ జీవితంలో గొప్పవాళ్లు కావాలని, కరాటే పోటీలకు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులకు అభినందనీయమన్నారు. అనంతరం కరాటేలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నిరంజన్‌రెడ్డి షీల్డులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శైలజ, మున్సిప ల్‌ చైర్‌ పర్సన్‌ కరుణశ్రీ, వైస్‌చైర్మన్‌ కర్రెస్వామి, వై స్‌ ఎంపీపీ బాలచంద్రారెడ్డి, మార్కెట్‌ కమిటీ మా జీ చైర్మన్‌ బుచ్చారెడ్డి, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు హరిశంకర్‌నాయుడు, నాయకులు ఎల్ల య్య, బాల్‌రాం, నిర్వాహకులు కుమారస్వామి నాయుడు, విజయ్‌కుమార్‌ త దితరులు పాల్గొన్నారు. 

గ్రామాల అభివృద్ధి కోసమే పల్లె ప్రగతి

గోపాల్‌పేట : గ్రామాల అభివృద్ధి కోసమే పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని పొల్కెపహాడ్‌ గ్రామంలో వనపర్తి డిగ్రీ కళాశాల యూనిట్‌-3,4 విద్యార్థులకు ఏర్పాటు చేసిన శీతాకాల ప్రత్యేక శిబిరం ఆదివారంతో ముగిసింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ పారిశుధ్య గ్రామాలుగా తీర్చిదిద్ధేందుకు ప్రతి ఒక్క రూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం లో భవిష్యత్‌లో సాగు, తాగు నీటి కష్టాలు ఉండవన్నారు. ప్రభుత్వ విప్‌ గువ్వల బాల్‌రాజు మా ట్లాడుతూ చదువుతో ఏదైనా సాధించవచ్చన్నారు. పిల్లలను క్రమశిక్షణతో పెంచితేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. తన సొంత గ్రామమైన పొల్కెపహాడ్‌ అభివృద్ధికి తన వంతు సహకా రం అందించి రుణం తీర్చుకుంటామన్నారు. అ నంతరం ఎన్‌ఎస్‌ఎస్‌ క్యాడెట్లకు బహుమతులను ప్రదానం చేశారు. నిరంజన్‌రెడ్డి, గువ్వలను డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చందోజీరావు, యూ నిట్‌-3,4 ఆఫీసర్స్‌ నాగరాజు, ధామ్‌సింగ్‌లు శా లువా, పూలమాలలతో సన్మానించారు. అంతర్జాతీయ మ హిళా దినోత్సవం సందర్భం గా జెడ్పీటీసీ భార్గవి, సర్పంచ్‌ రజనిలను సన్మానించారు. కా ర్యక్రమంలో సింగిల్‌ విండో చై ర్మన్‌ రఘుయాదవ్‌, వైస్‌ చైర్మ న్‌ రాములు, నాయకులు తి రుపతి యాదవ్‌, చంద్రశేఖర్‌, మతీన్‌, రిటైర్డ్‌ జెన్‌కో ఎస్‌ఈ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.


logo