బుధవారం 03 జూన్ 2020
Narayanpet - Mar 09, 2020 , 00:44:22

స్త్రీ కష్టాన్ని సమాజం గుర్తించాలి

స్త్రీ కష్టాన్ని సమాజం గుర్తించాలి

కొత్తకోట : మహిళల కష్టాన్ని సమాజం గుర్తించాలని ఎస్పీ అపూర్వరావు అన్నా రు. ఆదివారం కొత్తకోట మండల పరిషత్‌ కార్యాలయంలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ సమావేశపు హాల్‌లో ఎంపీపీ మౌనిక అధ్యక్షతన అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎస్పీ, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సతీమణి ఆల మంజుల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు పోటీ ప్రపంచంలో రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. మహిళలు అనుకుంటే ఏ రంగంలోనైనా రాణించే సత్తా ఉందన్నా రు. ఆల మంజుల మాట్లాడుతూ సాధికారత కోసం మహిళలు కృషి చేయాలన్నారు. తమ స్వేచ్ఛకు పటిష్టమైన చట్టాలను తీసుకువచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. షీటీంలతో తమ భద్రతకు కృషి చేస్తున్నారన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలను ఇస్తూ వ్యాపార రంగంలో ప్రోత్సహిస్తున్నారన్నారు. అనంతరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆయా రంగాల్లో ప్రతిభ కనబర్చిన మహిళలను సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చై ర్మన్‌ సుకేశిని, వైస్‌ చైర్మన్‌ జయమ్మ, కౌన్సిలర్లు సంధ్య, పద్మ, నారాయణమ్మ, మదనాపురం ఎంపీపీ పద్మావతి, మహిళా సర్పంచులు, ఎంపీటీసీలు, వెలుగు సమాఖ్య సభ్యులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు. logo