గురువారం 04 జూన్ 2020
Narayanpet - Mar 09, 2020 , 00:23:51

బాధ్యతాయుత పని విభజనకే వర్టికల్‌ విధానం

బాధ్యతాయుత పని విభజనకే వర్టికల్‌ విధానం

వనపర్తి టౌన్‌: పోలీస్‌శాఖలో పని విభజన, సమర్థవంతంగా విధి నిర్వహణ, ప్రతి దస్త్రం ఒక క్రమపద్ధతిలో అమర్చి పనులు సజావుగా సాగేందుకుపోలీస్‌ శాఖలో వర్టికల్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొంతకాలంగా ఈ విధానం అమలులోకి రావడంతో పోలీసుల పనితీరులోనూ, ఆఫీస్‌ నిర్వహణలోను మెరుగైన ఫలితాలు సాధిస్తు పోలీసుల గౌరవ ప్రతిష్టలు పెంచడంతోపాటు ప్రజల నుంచి ప్రశంసలు పొందుతున్నారు. విధి నిర్వహణలో చక్కగా రాణిస్తూనే ప్రజల్లో పోలీసులకు కీర్తి ప్రతిష్టలు తీసుకువచ్చే అధికారులు, సిబ్బందికి ఎప్పటికప్పుడు ప్రశంసలు అందజేస్తున్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి రూపొందించిన 15 వర్టికల్స్‌ విధానాన్ని 15 విభాగాలుగా విభజించారు. ఒక్కో విభాగానికి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి నుంచి కానిస్టేబుల్‌ స్థాయి వరకు పోలీస్‌ సిబ్బంది, అధికారులను బాధ్యులుగా చేస్తు పని విభజన చేపట్టారు. అందులో కేసుల నమోదు, పోలీసులకు ప్రజలతో ఉన్న ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం ఎప్పటికప్పుడు వివిధ నేరాలపైన, సాంఘిక దురాచారాలపైన అవగాహన కల్పించేందుకు కళాజాత బృందాల పనితీరు, నేరాల నియంత్రణకు మూడో కన్ను సీసీ కెమెరాల పనితీరు, నిర్వహణ చేపట్టారు. చోరీల నియంత్రణ, మహిళా కేసులు, భద్రత విభాగాల్లో ఆయా పోలీస్‌ స్టేషన్ల వారీగా సమర్థవంతమైన నిర్వహణ చేసేందుకే ఈ వర్టికల్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. 

పనితీరుకు ప్రశంసలు

పోలీస్‌ స్టేషన్‌లో ఫైలింగ్‌ నిర్వహణతోపాటు బ్లూకోర్ట్‌, షీ టీమ్స్‌, విధుల నిర్వహణ తదితర ఆంశాలలో బాధ్యతాయుతంగా పనిచేసిన అధికారులు, సిబ్బందిని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తున్నారు. అందరికీ స్ఫూర్తిదాయకంగా మరింత రెట్టింపు ప్రోత్సాహంతో విధులు నిర్వహించడంతోపాటు పనిచేసేందుకుగాను ఎప్పటికప్పుడు వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వరావు ప్రశంసిస్తూ అభినందిస్తున్నారు. హోంగార్డు స్థాయి నుంచి స్టేషన్‌లో ఉండే ఎస్సై స్థాయి వరకు అధికారులు, సిబ్బందిని ఇటీవల అభినందించి ప్రశంసాపత్రాలతో ప్రోత్సహించారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా దాదాపు 20మందికి పైగా ప్రశంసాపత్రాలు అందజేసి ప్రోత్సహించారు. 


logo