శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Mar 08, 2020 , 01:00:36

విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలి

  విద్యార్థులు అన్ని రంగాల్లో ముందుండాలి

అడ్డాకుల : మండల పరిధిలోని కందూరు రామలింగేశ్వర స్వామి కల్యా ణం శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం శివపార్వతుల విగ్రహాలకు కృష్ణా జలాలతో స్నానం చేయించి కల్యాణానికి సిద్ధం చేశారు. వేద మంత్రాలతో పురోహితులు అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యా ణం జరిపించారు. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పట్టు వస్ర్తాలతో పాటు ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. కల్యా ణం అనంతరం శివపార్వతుల విగ్రహాలపై ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ ఈ నాగార్జున్‌రెడ్డి, సర్పంచ్‌ శ్రీకాంత్‌ దంపతులు, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డిలు ముత్యాల తలంబ్రాలు పోశా రు. శివపార్వతుల కల్యాణానికి కందూరు, చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు, మహిళలు అ ధిక సంఖ్యలో హాజరయ్యా రు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో దేవాలయం ఈవో రాజు, క్ల ర్కు అనంతశ ర్మ, స్నేహ కంపె నీ చైర్మన్‌ రాం రెడ్డి, మేనేజర్‌ రామేశ్వర్‌రెడ్డి, నాయకులు రమేశ్‌ గౌడ్‌, విజయకుమార్‌రెడ్డి, మహమూద్‌, రాజు, మహిళలు పాల్గొన్నారు.

VIDEOS

logo