శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Mar 07, 2020 , 00:21:18

డోంట్‌ వర్రీ

డోంట్‌ వర్రీ

వనపర్తి ప్రతినిధి, నమస్తే తెలంగాణ : వచ్చే యాసంగి సీజన్‌లో వరి ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సా రించింది. ఇటీవల జిల్లా అదనపు కలెక్టర్‌ డీ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో పౌరసరఫరాలు, సహకార శాఖ, డీఆర్‌డీఏ, మెప్మా, వ్యవసాయ మార్కెటింగ్‌ అధికారులతో యాసంగి కొనుగోళ్ల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో సాగైన వరి పంట విస్తీర్ణం, దిగుబడి అంచనాలకు అనుగుణంగా.. ప్రభుత్వం మద్దతు ధరకు రైతుల నుంచి ధాన్యం కొనుగోలుపై ప్రణాళిక రూపొందించుకుంటుంది. జిల్లా యాసంగి సాగుబడు లు జోరుగా ఉన్నాయి. గతేడాది కేవలం 47 వేల ఎకరాల్లో మాత్రమే యాసంగి వరిసాగు అయింది. ఈ ఏడాది రబీలో మాత్రం రెండింతలు మించి సాగు పెరిగింది. ఊహకందని విధంగా జరిగిన యాసంగి సాగు తో వ్యవసాయ అధికారులే ఉక్కిరి బిక్కిరి అవుతున్నా రు. జూరాలతోపాటు బీమా, ఎంజీకేఎల్‌ఐ ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరు పుస్కలంగా పారడంతోనే యాసంగిలో ఒక్కసారిగా సాగుబడులు పెరిగేందుకు దోహదపడిందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుత యాసంగిలో లక్షా 14 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. వానాకాలం సాగుబడులు చూస్తే లక్షా 37 వేల ఎకరాలు సాగయింది. వీటిని బట్టి వరి సాగులో వానాకాలం, యాసంగికి పెద్దగా తేడాలేకుండా పోయింది. 

120 కొనుగోలు కేంద్రాలు

   జిల్లా వ్యాప్తంగా యాసంగి వరి సాగుబడికి ప్రాధాన్యత పెరిగిన జరిగిన క్రమంలో విస్తృతంగా కొనుగో లు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 120 కేంద్రాల నుంచి యాసంగి వరి ధా న్యంను కొనుగోళు చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. వాటిలో ఇం దిరాక్రాంతి పథం(ఐకేపీ) ఆధ్వర్యంలో 78, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్‌) ఆధ్వర్యంలో 40, మెప్మా పరిధి లో 2 కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.  ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ.1835, సాధారణ రకానికి రూ.1815 మద్దతు ధరను క్వింటాలు వరికి చెల్లించనున్నారు. నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న ధాన్యానికి మాత్రమే ఈ ధరను అందిస్తారు. ప్రస్తుతం యాసంగి పంట ఉగాది పండుగ వరకు కోతలు పడనున్నాయి. ఇప్పటికే కొన్ని చోట్ల పొట్ట దశను మించి చేలు కనిపిస్తుండగా, మరో 20 రోజులకు అధికంగా కోతలు పడుతాయని అంచనా వేస్తున్నారు. 

2.40 లక్షల టన్నుల లక్ష్యం..

జిల్లాలో యాసంగిలో సీజన్‌లో  2.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని అధికారులు అంచనా వేశారు. ఈమేరకు రైతుల ద్వారా దాన్యం సేకరణకు అవసరమైన సామగ్రి, యంత్రాలపైన ఆయా శాఖలు దృష్టి పెట్టాయి. ఇందుకు  1400 టార్పాలిన్లు, 140 తూకం వేసే యంత్రాలు, 140 తేమ శాతం చూయించే యంత్రాలు, 37 లక్షల గన్నీ బ్యాగులు అవసరం అవుతాయని గుర్తించారు. కేంద్రాలు ప్రారంభమై ధాన్యం తరలించే నాటికి ఇవి అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏఫ్రిల్‌ 1 నుంచి దాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

ఇబ్బందులు రానియొద్దు - మంత్రి నిరంజన్‌ రెడ్డి

యాసంగిలో వరిధాన్యం కొనుగోళ్లపై ఎలాంటి ఇబ్బందులు రానివ్వకూదడని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల యాసంగి వరి కొనుగోళ్లపై మంత్రివర్గ ఉప సంఘం బృందం మంత్రి సింగిరెడ్డి సమక్షంలో  ఈటెల రాజేందర్‌, గంగుల కమ లాకర్‌ల సమక్షంలో సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా అధికార యంత్రాంగానికి పలు సూచనలు చేశారు. అంచనాలకు మించి భారీగా యాసంగి సాగుబడులు జరిగిన సందర్భంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బం దులను రైతులకు రానివ్వకూడదని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో 77 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఉందని, వాటికి అనుగుణంగానే కేంద్రాల ప్రారంభం ఉండాలని కూడా మంత్రులు దిశా నిర్దేశం చేశారు. గతంలో ప్రభుత్వ కొనుగోళ్లపై సాదాసీదాగా వ్యవ హరించే పరిస్థితుల నుంచి నేడు సర్కార్‌ ముందే పకడ్బందీ నిర్వహణకు సమీక్షలు ఏర్పాటు చేయడం ద్వారా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావడం లేదు. తూకాలు, రైతుల ఖాతాలో డబ్బుల జమ, యంత్రాల సమకూర్పు, ధాన్యం తరలింపు, గన్నీ బ్యాగుల కొరతలు, హమాలీలు, రైస్‌మిల్లర్స్‌ అకనాలెడ్జ్‌ స్లిప్పుల సమస్యలు ఎదురవ్వకుండా తగిన ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకోవడంపై ముందస్తుగానే సమీక్షించడంతో కొనుగోళ్లు సాఫీగా జరుగుతున్నాయి. 

VIDEOS

logo