సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Mar 07, 2020 , 00:16:49

నిరుద్యోగులు ఆర్థికంగా ఎదగాలి

నిరుద్యోగులు ఆర్థికంగా ఎదగాలి

వనపర్తి,నమస్తే తెలంగాణ : ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం కింద ఆర్థిక సహాయం పొందిన నిరుద్యోగ అభ్యర్థులు యూనిట్లను బాగా నిర్వహించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా సూచించారు. శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం లో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం కింద గత సంవత్సరం నవంబర్‌ 21 తర్వాత ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకున్న వారికి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ స్వయంగా హాజరై అభ్యర్థులను ఇంటర్వ్యూ లు చేశారు. మొత్తం 109 దరఖాస్తులు రాగా, 78 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు. ఇందులో 35మంది యూ నిట్లకు ఎంపికయ్యారు. ఉపాధి కల్పన పథకం కింద జిల్లా పరిశ్రమల శాఖ, ఖాదీ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ బోర్డు, ఖాదీ విలేజ్‌ ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు వివిధ రకాల యూ నిట్లను అందిస్తామన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ బ్యాంకుల స్థాయి లో మొదటి స్క్రీనింగ్‌లో దరఖాస్తులు తిరస్కరించకుండా జాగ్రత్తగా చేయాలని, జిల్లాలోని ఆ యా ప్రాంతాలలో అనువుగా ఉండే యూనిట్లకు ఆ మోదం తెలపాలని, ఈ విషయంలో బ్యాంకర్ల పా త్ర ముఖ్యమన్నారు. ఇంటర్వ్యూలకు జిమ్‌, మెడికల్‌ ల్యా బ్‌ టెక్నిషియన్‌, జిరాక్స్‌, ఇస్తరాకుల తయారీ, పేపర్‌ ప్లేట్లు, కప్పులు తయారీ, సిమెంట్‌ ఇటుకల త యారీ, ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ, ప్రింటింగ్‌ ప్రెస్‌, మి నీ రైస్‌మిల్లు, మోటరు వైండింగ్‌, దాల్‌మిల్‌, కార్పెంటర్‌ తదితర యూనిట్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్‌ నరేశ్‌కుమా ర్‌, ఎల్‌డీఎం సురేశ్‌, డీఆర్‌డీవో గణేశ్‌ హాజరయ్యారు. 

VIDEOS

logo