బుధవారం 03 జూన్ 2020
Narayanpet - Mar 07, 2020 , 00:15:32

చికెన్‌ తింటే నో ప్రాబ్లం

చికెన్‌ తింటే నో ప్రాబ్లం

పాన్‌గల్‌ : చికెన్‌తింటే కరోనా వైరస్‌ వ స్తుందనే వదంతులు నమ్మొద్దని ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, ఎస్సై తిరుపాజీ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు రాముయాదవ్‌ అన్నా రు. శుక్రవారం పాన్‌గల్‌ మండల కేం ద్రంలోని పౌల్ట్రీ యజమాని ఎండీ ఖాదర్‌పాష తన సొంత కోళ్ల షెడ్‌ నుంచి సు మారు 2వేల కోళ్ల ను ప్రజలకు ఉచితం గా పంపిణీ చేశారు. ఈసందర్భంగా వా రు మాట్లాడుతూ ఇటీవల కరోనా వైరస్‌ ప్రభావం వల్ల చాలా మంది చికెన్‌ తినడానికి జంకుతున్నారని తెలిపారు. చికెన్‌ తినడం వల్ల కరోనా వైరస్‌ రాదని, యథేచ్ఛగా పోషక విలువలున్న చికెన్‌, మటన్‌ అందరూ తినవచ్చని సూచించా రు. మొఖానికి మాస్కులు ధరించడం, తినడానికి ముందు చేతులకు శుభ్రపరుచుకోవాలని సూచించారు. తుమ్మినా, దగ్గినా చేతిరుమాలను అడ్డంగా ఉంచుకోవాలన్నారు. అనంతరం చికెన్‌ ప్రై చేసి తిని, చికెన్‌తింటే కరోనా వైరస్‌ రాదని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్‌ మెంబర్‌ యూనిస్కాన్‌, నవీన్‌రెడ్డి, బాలరాజుగౌడ్‌ పాల్గొన్నారు.


logo