శుక్రవారం 29 మే 2020
Narayanpet - Mar 07, 2020 , 00:14:35

జీవన నైపుణ్యాలను పెంపొందించాలి

జీవన నైపుణ్యాలను పెంపొందించాలి

వనపర్తి విద్యావిభాగం : పాఠశాల స్థాయిలో విద్యార్థుల్లో  జీవన నైపుణ్యాలను పెంపొందించాలని జిల్లా సెక్టోరియల్‌ అధికారి చంద్రశేఖర్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం బయోసైన్స్‌ ఉపాధ్యాయులకు నిర్వహించిన కౌమర దశ, నైపుణ్యాలు, ఎయిడ్స్‌ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా 8, 9, 10వ తరగతుల విద్యార్థులు శారీరకంగా, మానసిక ఉద్వేగంగా పలు మార్పులు చోటుచేసుకుంటాయని, ఈ దశలో ఒత్తిడికి గురై సరియైన నిర్ణయాలు తీసుకోకుండా ఆకర్షణకు లోనవుతారని, తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కల్పించి సరియైన నిర్ణయాలు తీసుకునేలా చూడాలన్నారు. ఉపాధ్యాయులు తమ పాఠశాల, సముదాయాల స్థాయిలో ఇతర విద్యార్థులకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీ శ్రీమతి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


logo