బుధవారం 24 ఫిబ్రవరి 2021
Narayanpet - Mar 07, 2020 , 00:11:26

హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలి

వనపర్తి, నమస్తే తెలంగాణ : హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించుకోవాలని మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రమేశ్‌గౌడ్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని 15వ వార్డులో కౌన్సిలర్‌ కృష్ణతో కలిసి ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మహిళా సంఘం సభ్యులు పాల్గొన్నారు. 

పెద్దమందడిలో..

పెద్దమందడి : హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించేలా చూడాలని అనకాయపల్లి తండా సర్పంచ్‌ పాత్లావత్‌ లక్ష్మి అన్నారు. శుక్రవారం అనకాయపల్లి గ్రామ పంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపులా హరితహారంలో నాటిన అన్ని మొక్కలను కాపాడుకోవాలన్నారు. అదేవిధంగా ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నుంచి మంజూరైనటువంటి శ్మశానవాటిక, సీసీ రోడ్ల నిర్మాణం ఎక్కడ చేపట్టాలని గ్రామసభలో చర్చించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ ఆంజనేయులు, నాయకులు రాందాస్‌, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు ఉన్నారు. 

VIDEOS

logo