శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Mar 05, 2020 , 23:41:19

పేటను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి

పేటను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలి

నారాయణపేట టౌన్‌ : పేట జిల్లా ను పరిశ్రమల పరంగా అభివృద్ధి పథంలో నడిపించాలని కలెక్టర్‌ హరిచందన చెప్పారు. జిల్లాలో టీఎస్‌ ఐ పాస్‌ క్రింద సబ్సిడీపై వాహనాలను మంజూ రు చేస్తున్నట్లు కలెక్టర్‌ పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో టీఎస్‌ ఐపాస్‌ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హరిచందన మాట్లాడుతూ షెడ్యూల్డ్‌ కులాలు, షె డ్యూల్డ్‌ తెగలు, వికలాంగులకు సబ్సిడీ పై మంజూరు చేస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపా రు. ఎస్సీలలో 11మంది లబ్ధిదారుల కు, ఎస్‌టీలకు 5 మంది లబ్ధిదారులకు, వికలాంగులకు 2 చొప్పున మంజూరు చేస్తున్నామన్నారు. పురుషులకు 35 శాతం, స్త్రీలకు 45 శాతం సబ్సిడీతో వాహనాలు మంజూరు చేస్తామని కలెక్టర్‌ వివరించారు. ఈ సమావేశంలో ఆర్డీవో శ్రీనివాసులు, రామసుబ్బారెడ్డి, మధు, టీఎస్‌ ఐపాస్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 


సమాచార హక్కు చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

సమాచార హక్కు చట్టంపై అధికారులు పూర్తి అవగాహనను కలిగి ఉండాలని కలెక్టర్‌ హరిచందన పేర్కొన్నారు. ఎవరైనా కోరినా సమాచారాన్ని ఇవ్వడంలో అజాగ్రత్తగా ఉండరాదని హెచ్చరించారు. గురువారం పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టంపై వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. తమ దగ్గర ఉన్న సమాచారం ఏదైనా పూర్తిగా ఇవ్వాలని, సమాచారం లేని ఎడల సెక్షన్‌ల ప్రకారం సమాచారం అడిగిన వారికి లిఖిత పూర్వకంగా ఇవ్వాలని చెప్పారు. సీనియర్‌ ప్యాకల్టీ మహ్మద్‌ జపురుల్లా ఖాన్‌ సమాచార హక్కు చట్టం 2005 నందలి సెక్షన్‌ 1 నుంచి సెక్షన్‌ 31 వరకు వివరించి సందేహాలను నివృత్తి చేశారు. ఈ శిక్షణలో ఆర్డీవో శ్రీనివాసులు, మహబూబ్‌నగర్‌ బ్రాంచ్‌ కో ఆర్డినేటర్‌ శంకరాచారి, వివిధ శాఖల ఉద్యోగులు పౌర సమాచార, సహాయ పౌర సమాచార శాఖ అధికారులు పాల్గొన్నారు. 


VIDEOS

logo