శ్రీరామకొండ క్షేత్రాన్నిపర్యాటకంగా తీర్చిదిద్దుతాం

కోయిలకొండ: జిల్లా లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీరామకొండను పర్యాటకంగా అన్నివిధాల అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక కృషి చేస్తానని పేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రంలో శ్రీరామకొండ పైకి రూ.1కోటి 50లక్షలతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కొండ కిందిభాగం ప్రభుత్వ జూనియార్ కళాశాల నుంచి రామకొండపై వరకు అధునాతనంగా ఇరువైపులా కాలువలతో సీసీ రోడ్డు పనులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. కొండపైకి వచ్చే భక్తులకు తాగునీరు, విద్యుత్ సదుపాయాలు కల్పించనున్నట్లు వివరించారు. మండలంలో పదో తరగతి వార్షిక పరీక్షలో వందకు వంద మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య కోసం సహకారం అందిస్తామనని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పన, విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు అందించుటకు కృషి చేస్తానన్నారు. మండలంలో చిన్నలింగాల్చేడ్లో రూ.కోటి 45లక్షలతో నిర్మించే కత్వ ఆనకట్ట నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. వింజామూర్, సురారంలో సైన్స్‌ల్యాబ్, బీసీ కమ్యునిటీ భవనాన్ని ప్రారంభించారు. సురారం, పార్‌పల్లిలో ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణ పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో పేట టీఆర్ఎస్ కన్వీనర్ రవీందర్‌రెడ్డి, ఎంపీపీ శశికళా, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కృష్ణయ్య తదితరులు పాల్గ్గొన్నారు.
తాజావార్తలు
- టెస్ట్ అరంగేట్రానికి 50 ఏళ్లు.. గవాస్కర్‌ను సత్కరించిన బీసీసీఐ
- అతను తెలియక తప్పు చేశాడు: బీహార్ సీఎం
- బీజేపీలోకి నటుడు మిథున్ చక్రవర్తి?
- ఇన్‌కం టాక్స్ దాడులపై స్పందించిన హీరోయిన్ తాప్సీ
- బుమ్రా, అనుపమ పెళ్లిపై వచ్చిన క్లారిటీ..!
- అశ్విన్, అక్షర్.. వణికిస్తున్న భారత స్పిన్నర్లు
- బీజేపీలో చేరిన బెంగాల్ కీలక నేత దినేశ్ త్రివేది
- హాట్ ఫొటోలతో హీటెక్కిస్తున్న పూనమ్ బజ్వా
- కన్యాకుమారి లోక్‌సభ.. బీజేపీ అభ్యర్థి ఖరారు
- మహేష్ బాబు కొత్త కార్‌వ్యాన్ ఇదే..!