గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Mar 05, 2020 , 00:38:49

కందులను కొనుగోలు చేయాలి

 కందులను కొనుగోలు చేయాలి

నారాయణపేట టౌన్‌ : రైతుల కం దులను కొనుగోలు చేసేలా చర్యలు తీ సుకోవాలని కలెక్టర్‌ హరిచందన అధికారులను ఆదేశించారు. జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఆరు కొనుగోలు కేంద్రాలు పని చేసేవని, కాని ప్రస్థుతం 2 మాత్రమే పని చేస్తున్నాయని తెలిపారు. బుధవారం పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో మార్క్‌ఫెడ్‌, మార్కెటింగ్‌, వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మా ట్లాడారు. జిల్లాలో రెండు కందుల కొ నుగోలు కేంద్రాలు మాత్రమే పని చేయ డం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. మొత్తం ఆరు చోట్లా కందుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నాణ్యత గల కందులను కొనుగోలు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్‌డీవో చీర్ల శ్రీనివాసులు, మార్క్‌ఫెడ్‌ అధికారి ఇంద్రసేన్‌, డీఎంవో భాస్కరయ్య, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్‌ సుధాకర్‌, సీఐ సంపత్‌ తదితరులు ఉన్నారు. 

VIDEOS

logo