శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Mar 04, 2020 , 05:34:38

చివరి దశకు.. పట్టణ ప్రగతి

చివరి దశకు.. పట్టణ ప్రగతి

 బల్దియాల్లో జోరుగా అభివృద్ధి పనులు

కోస్గిలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పర్యటన

 పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దాలని పిలుపు


  పట్టణ ప్రగతి కార్యక్రమం చివరి దశకు చేరింది. బల్దియాల్లో జోరుగా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. మంగళవారం తొమ్మిదో రోజు పట్టణాల్లోని వివిధ వార్డులలో అధికారులు, ప్రజాప్రతినిధులు పర్య టించారు. సమస్యలు గుర్తింపు పరిష్కారానికి కృషి చేశారు. కోస్గి పట్టణంలోని 

7, 8, 9, 13, 15 వార్డుల్లో కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పనులను పరిశీలించారు. పట్టణాలు బాగు పడాలంటే అందరం పరిశుభ్రతను పాటించాల్సిన అవసరం ఉందన్నారు.  

- కోస్గి


కోస్గి : పట్టణాలలో పట్టణ ప్రగతి పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. మంగళవారం కోస్గి పట్టణంలోని 7,8,9,15.13వ వార్డులలో పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పనులను కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం మాట్లాడుతూ పట్టణ ప్రగతి కార్యక్రమంతో పట్టణాలను సుందరంగా తీర్చుదిద్దుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ముఖ్యంగా పట్టణాలు బాగు పడాలంటే మనందరం పరిశుభ్రతను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే మనందరి ఆరోగ్యం  బావుంటుందన్నారు. మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించే పరిస్థితి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో మున్సిపల్‌ ఎన్నికల అనంతరం సీఎం కేసీఆర్‌ పట్టణ ప్రగతి లాంటి అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మన అదృషం అన్నారు. పట్టణ ప్రగతితో పట్టణాలు పరిశుభ్రంగా మారడంతోపాటు వచ్చే వానాకాలంలో ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కోస్గి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఎం శిరీష, వైస్‌ చైర్‌ పర్సన్‌ అన్నపూర్ణ, వార్డు కౌన్సిలర్‌ మంజుల, జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, కమిషనర్‌ జే శామ్యూల్‌, నాయకులు శాసం రామకృష్ణ, రాజేశ్‌, సంతోష తదితరులు పాల్గొన్నారు. 


పేదింటికి పెద్దదిక్కు సీఎం కేసీఆర్‌

కోస్గిటౌన్‌ : సీఎం కేసీఆర్‌ పేదింటికి పెద్దదిక్కుగా ఉంటూ ఆడపిల్లల పెళ్లి కోసం రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నారని కొడంగల్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ అన్నారు. మంగళవారం ఎంపీపీ కార్యాలయంలో 21మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ చెక్కులు ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పట్నం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పేదలకు ఆడపిల్లల పెళ్లి బరువు కూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం  పెళ్లి ఖర్చుల కోసమే రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తున్నదని,  దేశంలో ఇలాంటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మన సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఎం శిరీష, తాసిల్దార్‌ రాంకోటి, ఎంపీపీ మధుకర్‌రావు, వైఎస్‌ ఎంపీపీ సాయిలుతోపాటు ఆయా గ్రామాల సర్పంచులు, నాయకులు రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు. 

VIDEOS

logo