బుధవారం 03 జూన్ 2020
Narayanpet - Mar 04, 2020 , 05:24:10

మహిళలు ఆర్థికంగా ఎదగాలి

మహిళలు ఆర్థికంగా ఎదగాలి
  • ఉపాధిలో అభివృద్ధి చెందాలి
  • జూట్‌ బ్యాగుల తయారీతో ఉపాధి
  • కలెక్టర్‌ హరిచందన, జెడ్పీ చైర్‌పర్సన్‌ వనజ
  • జిల్లా కేంద్రంలో జూట్‌ బ్యాగుల తయారీ శిక్షణా కేంద్రం ప్రారంభం

నారాయణపేట టౌన్‌ : మహిళలు స్వయం ఉపాధి రంగాలలో అభివృద్ధి చెంది ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్‌ హరిచందన పిలుపునిచ్చారు. మంగళవారం మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల సభ్యులకు జూట్‌ బ్యాగ్‌(అల్లికల) త యారి శిక్షణా కేంద్రాన్ని కలెక్టర్‌ హరిచందన జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, ఎమ్మేల్యే సతీమణి స్వాతిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడారు. ఈ శిక్షణలో మొత్తం 2 బ్యాచ్‌లలో ఇ వ్వనున్నట్లు మొదటి బ్యాచ్‌లో 35 మం ది, రెండవ బ్యాచ్‌లో మిగిలిన వారికి శిక్షణ ఇస్తారన్నారు. మహిళలు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌, జెడ్పీ చైర్‌ పర్సన్‌లు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీ పీడీ కాళిందిని, ఆర్డీవో శ్రీనివాసులు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ, శిక్షకురాలు పద్మావతి, టీఎల్‌ఎఫ్‌ ఓబీ మాధవి, ఆర్‌పీ జ్యోతి పాల్గొన్నారు. 


ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలి

నారాయణపేట టౌన్‌ : మహిళలు తమ ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్‌ హరిచందన, జెడ్పీ చైర్‌పర్సన్‌ కే వనజలు సూచించారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సం దర్భంగా మంగళవారం పట్టణంలోని జిల్లా దవాఖానలో ఉమాంగ్‌ హెల్త్‌ సెంటర్‌ హైదరాబాద్‌ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమెన్స్‌ అవేర్‌నెస్‌ క్యాంప్‌ను కలెక్టర్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌లు ప్రారంభించి మాట్లాడారు. క్యాన్సర్‌పై ప్రతి మహిళ అవగాహన కలిగి ఉండాలన్నారు.  నేటి నుంచి 6వ తేది వరకు 4 రోజుల పాటు ఉమాంగ్‌ హెల్త్‌ సెంట ర్‌ వైద్యులు ఎర్లీ డిటెక్షన్‌ ఆఫ్‌ బ్రెస్ట్‌ క్యా న్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించారు. ప్రతి రోజు 30 మంది మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి క్యాన్సర్‌ లక్షణాలు ఉంటే హైదరాబద్‌లోని ఉమాంగ్‌ హెల్త్‌ సెంటర్‌ శస్త్ర చికిత్సలు అందించనున్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో కాళిందిని, ము న్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ, ఎమ్మెల్యే సతీమణి స్వాతిరెడ్డి, ఆర్‌డీవో శ్రీనివాసులు, ఉమాంగ్‌ హెల్త్‌ సెంటర్‌ వైద్యులు సుస్మితాజాన్‌, సుప్రియ, డాక్టర్‌ మల్లికార్జున్‌, రంజిత్‌, డీపీఎం శేషన్న, రామునాయక్‌, వెంకట్‌రెడ్డి, బాలచందర్‌ తదితరులు పాల్గొన్నారు.


logo