మంగళవారం 02 మార్చి 2021
Narayanpet - Mar 02, 2020 , 23:43:07

రేపటి నుంచి ఆర్థిక గణన

రేపటి నుంచి ఆర్థిక గణన

వనపర్తి, నమస్తే తెలంగాణ : దేశ సమగ్ర ఆర్థిక వ్య వస్థ నిర్మాణంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆ దేశాల మేరకు ఈ నెల 4వ తేదీ నుంచి జిల్లాలో ఆర్థిక గణన చేపట్టనున్నట్లు కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా తెలిపారు. సోమవారం తన చాంబర్‌లో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సం దర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు ఎలా ఆర్థిక రా బడి పొందుతున్నారో తెలుసుకుని దాని ఆధారంగా గ్రా మ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు విశ్వసనీయ డేటాబేస్‌ను రూపొందించనున్నట్లు చెప్పారు. దీనిద్వారా ఆ ర్థిక పరమైన పథకాల రూపకల్పన, పాలసీలను రూ పొందించడం జరుగుతుందన్నారు. పంటల ఉత్పత్తి, మొక్కలను నాటడం మినహా వ్యవసాయం, వ్యవసాయేతర రంగాల ద్వారా వచ్చే ఉత్పత్తి, వస్తువులు, సేవ ల పంపిణీ వంటి ఆర్థిక కార్యక్రమాలన్నింటినీ ఈ గణ న సందర్భంగా లెక్కించనున్నట్లు తెలిపారు. ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆర్థిక గణన నిర్వహించేందుకు ఎన్యూమరేట్లకు శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో 365 మంది ఎన్యుమరేటర్లు, 48 మంది సూపర్‌వైజర్లను నియమించినట్లు వెల్లడించారు. జిల్లా స్థాయి కమిటీలో కలెక్టర్‌ చైర్మన్‌గా, సీపీవో, జిల్లా ఇన్ఫర్మేటిక్‌ అధికారులు సభ్యులుగా ఉన్నారని సీపీవో వివరించగా, డీ పీవో, మైన్స్‌, ఫ్యాక్టరీస్‌ తదితర అధికారులను కూడా కమిటీలో చేర్చాలని కలెక్టర్‌ సూచించారు. అధికారిని భాగస్వాములను చేయాలని, ముందుగా మొదటి విడ త గణన చేపట్టే 48 గ్రామాలకు సంబంధించి ప్రణాళిక రూపొందించి, 4వ తేదీలోగా సమర్పించాలని చెప్పా రు. గణన విషయాన్ని ముందుగా గ్రామాల్లో చాటింపు వేయించాలన్నారు. మండల స్థాయి అధికారులు, తాసిల్దార్‌లు వారి పరిధిలోని గ్రామాల్లో నిర్వహించే ఆర్థిక గణనను పర్యవేక్షించాలని, ముందుగా చిన్న గ్రామాల్లో సర్వే ప్రారంభించాలని సూచించారు. అనంతరం ఏడో ఆర్థిక గణనకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. సమావేశంలో సీపీవో రవీందర్‌ రెడ్డి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్‌ నరేశ్‌కుమార్‌, ఆర్థిక గణన జిల్లా మేనేజర్‌ రాజేశ్వర్‌ రెడ్డి, జిల్లా కోఆర్టినేటర్‌ మాలిక్‌, స్టాటిస్టికల్‌ అధికారి రమేశ్‌ తదితరులు హాజరయ్యారు. 

VIDEOS

logo