గురువారం 04 జూన్ 2020
Narayanpet - Mar 02, 2020 , 23:39:01

పట్టణానికి అన్ని వైపులా మొక్కలు నాటాలి

పట్టణానికి అన్ని వైపులా మొక్కలు నాటాలి

వనపర్తి, నమస్తే తెలంగాణ : పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మంగళవారం చేపట్టనున్న మెగా ప్లాంటేషన్‌ సందర్భంగా పట్టణానికి అన్ని వైపులా మొక్కలు నాటాలని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించారు. సోమవారం ఆమె వనపర్తి మున్సిపాలిటీలో మెగా ప్లాంటేషన్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముందుగా గోపాల్‌పేట రోడ్డులో సెయింట్‌ థామస్‌ పాఠశాల వద్ద రహాదారికి ఇరువైపులా మొక్కలు నాటేందుకు తవ్విన గుంతలను పరిశీలించారు. మొక్కలను ఒక క్రమ పద్ధతిలో నాటాలని, అవసరమైన ఎరువు వేయాలని, తగినంత నీరు పోయాలన్నారు. అలాగే గుంతలు కూడా సరైన విధంగా తవ్వాలని మున్సిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌ రెడ్డికు సూచించారు. 85 శాతం మొక్కలను బతికించకపోతే కౌన్సిలర్‌లు, ప్రత్యేక అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. అనంతరం కలెక్టర్‌ మున్సిపల్‌ కార్యాలయంలో మొక్కలను పరిశీలించారు. కాగితం పూల మొక్కలు పొడవాటి తోట్లలో నాటాలని ప్రతి మొ క్కకు ట్రీ గార్డ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మున్సిపాలిటీ ఇంజినీర్లు కలెక్టర్‌ వెంట ఉన్నారు.


logo