బుధవారం 24 ఫిబ్రవరి 2021
Narayanpet - Mar 02, 2020 , 23:37:53

పట్టణ ప్రగతిలో మేముసైతం

పట్టణ ప్రగతిలో మేముసైతం

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీలలో జరుగున్న పట్టణ ప్రగతిలో మేముసైతం అంటూ జిల్లా చిత్రకారుల సంఘం ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించేలా స్వచ్ఛందంగా వాల్‌రైటింగ్స్‌ (గోడ రాత లు) చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలలో అవగాహన కల్పించేలా ప్రచార రాతలను రాస్తున్నారు. కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా ఆదేశాల మేరకు జిల్లా చిత్రకారుల సంఘం నేతృత్వంలో అన్ని మున్సిపాలిటీ కేం ద్రాల్లో గోడరాతలు రాస్తున్నారు. రెండు రోజులుగా ఆ త్మకూరు పట్టణంలోని బస్టాండ్‌, రద్దీ ప్రాంతాల్లో పరిసరాల పరిశుభ్రత, పచ్చదనం, ప్లాస్టిక్‌ నియంత్రణ తదితర ప్రచార రాతలను పేయింటింగ్‌ వేస్తున్నారు. చిత్రకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీరాం నేతృత్వంలో ఉపాధ్యక్షుడు భాస్కర్‌, మోహన్‌లాల్‌జీ, రేముద్దుల, సభ్యులు కృష్ణ, బీసన్న, తరుణ్‌, రాంబాబు, కృష్ణ తదితర సభ్యుల పర్యవేక్షణలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమవంతు సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న చిత్రకారులపై పలువురు అభినందనలు కురిపిస్తున్నారు.

VIDEOS

logo