గురువారం 04 మార్చి 2021
Narayanpet - Mar 02, 2020 , 00:03:53

రూపురేఖలు మార్చిన పట్టణ ప్రగతి

రూపురేఖలు మార్చిన పట్టణ ప్రగతి

రూపురేఖలు మార్చిన పట్టణ ప్రగతికొత్తకోట : ప్రధాన రోడ్లపై దుకాణదారులు బోర్డులను ఉంచరాదని కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా అన్నారు. ఆదివారం మున్సిపల్‌ కేంద్రంలోని 7, 8వ వార్డులలో ఆమె పర్యటించి పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పట్టణంలోని ప్రధాన రహదారిపై దుకాణ యాజమానులు తమ దుకాణాలకు సంబంధించి ఏర్పాటు చేసుకున్న బోర్డులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని, బోర్డులను తొలగించకపోతే దుకాణ యజమానుదారులకు నోటీసులు జారీ చేస్తు అపరాద రుసుము వసూలు చేయాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా ఆయా వార్డులకు చెందిన కౌన్సిలర్లు తమ వార్డులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. పట్టణ ప్రగతిలో ప్రధాన సమస్యలను పరిష్కరించేలా అధికారులు, ప్రజా ప్రతినిధులు కృషి చేయాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించి విజయవంతం చేయాలన్నారు. అదేవిధంగా పట్టణంలోని 8వ వార్డులో కన్యకాపరమేశ్వరి దేవాలయం వద్ద ప్రైవేట్‌ స్థలాల్లో ఉన్న కంపచెట్లను, చెత్తను తొలగించాలని ఆదేశించారు. అందుకు సంబంధించి స్థలాల యజమానులకు వెంటనే నోటీసులు జారీ చేయాలన్నారు. పట్టణ ప్రణాళికలో అభివృద్ధికి పబ్లిక్‌ టాయిలెట్స్‌, సమీకృత మార్కెట్‌ నిర్మాణానికి అనువైన స్థలాన్ని గుర్తించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా శ్మశానవాటికలు పార్కుల నిర్మాణానికి సైతం స్థలాన్ని కేటాయించాలని మున్సిపల్‌ కమిషనర్‌ కతలప్పను ఆదేశించారు. పట్టణంలోని ఆర్‌ఆండ్‌బీ స్థలంలో పబ్లిక్‌ టాయిలెట్స్‌ త్వరితగతిన నిర్మాణం చేపట్టాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సుకేశిని, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వామన్‌గౌడ్‌, ఎంపీపీ గుంతమౌనిక, మల్లేశ్‌, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్‌, వార్డు కౌన్సిలర్లు నాగన్న, రాములుయాదవ్‌, పట్టణ ప్రజలు వినోద్‌సాగర్‌, నరేందర్‌సాగర్‌, పెంటన్నయాదవ్‌, కృష్ణయ్యగౌడ్‌, హనుమంతుయాదవ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కతలప్ప, తసిల్దార్‌ రమేశ్‌రెడ్డి, ప్రత్యేకాధికారులు, వార్డు ఇన్‌ఛార్జి పర్యవేక్షకులు, మున్సిపల్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


VIDEOS

logo