ఆశాజనకంగా ఆముదం సాగు

గోపాల్పేట : రైతులు పండించే నూనె గింజల పంటల్లో వేరుశనగ తర్వాత రెండోది ఆముదం. ఆముదం పంటను మన ప్రాంతంలో రైతులు విస్తారంగా సాగు చేస్తారు. మండలంలో సుమారు వంద ఎకరాల్లో యాసంగిలో ఆరుతడి పంటగా ఆముదం పంటను సాగుచేస్తారు. ఆముదం సాగు కు తక్కువ పెట్టుబడి, తక్కువ నీటితో, ఖర్చుతో అధిక ఆదా యం రావటం వల్ల ఆముదం పంటపై రైతులు మక్కువ చూపుతున్నారు. ఆముదం నూనె వైమానిక, జెట్, రాకెట్ పరిశ్రమల్లో లూబ్రికెంట్ గాను, పాలిష్, ఆయింట్మెంటు, మందుల తయారీల్లోను, డీజిల్ పంపు సెట్లలో డీజిల్‌కు ప్ర త్యామ్నాయ ఇంధనంగాను, సబ్బులు తయారు చేసే పరిశ్రమల్లో, రంగులు, ముద్రణ కోసం ఉపయోగించే సిరా త యారీలో, నైలాన్ దారాలు, ప్లాస్టిక్ వస్తువులు తయారు చే సే పరిశ్రమల్లో వాడుతారు. నూనె తీయగా వచ్చిన చెక్కను సేంద్రీయ ఎరువుగా వాడుకోవచ్చు. లేత ఆముదం ఆకుల ను ఎరి పట్టు పురుగులకు ఆహారంగా ఉపయోగిస్తారు. ఆ ముదం వానాకాలంలో జూన్ 15 నుంచి జూలై 31 వరకు, రబీలో సెప్టెంబరు 15 నుంచి అక్టోబర్ 15 వరకు విత్తుకోవచ్చు. ఈ పంటను అన్ని నేలల్లో సాగు చేయవచ్చు. నీరు ఇంకే నేలలు అనుకూలం. నీరు నిలువుండే చవుడు నేలలు పనికిరావు. ఆయా రకాలను బట్టి పంట కాలం 90 రోజుల నుంచి 180 రోజులు, క్రాంతి (పీసీఎస్ 4), హరిత (పీసీఎస్124), కిరణ్(పీసీఎస్ 136), జ్యోతి (డీసీఎస్.9), జ్వాలా (48-1) వంటి అధిక దిగుబడులు వచ్చే రకాలు. ఆముదం పంటకు నేలను బట్టి 10-20రోజులకు ఒక తడి ఇవ్వాలని, విత్తిన రెండు నెలల వరకు పంటలో కలుపు లేకు ండా చూసుకోవాలి. పంట సాగుకు పశువుల ఎరువుతోపాటు నత్రజని, పొటాష్ నిచ్చే రసాయణ ఎరువులు ఉపయోగిస్తారు. పంటకు ఎర్రగొంగళి పురుగు, దాసరి పురుగు, పొగాకు లద్దె పురుగు, గొంగళి పురుగు వంటివి, తెగుళ్ల విషయానికి వస్తే ఆకుమచ్చ, ఎండు తెగులు, బూజుతెగులు వంటి చీడ పీడలు ఆశిస్తాయి. ఆముదం పంట అంతా ఒకే సారి కోతకు రాదు. 3-4సార్లు కోతకు వస్తుంది. 90 రోజులకు మొదటి గెల కోతకు వస్తుంది. రైతులు ఆముదం గింజల్లో 10శాతం తేమ ఉండే విధంగా ఎండ బెట్టి గోనె సంచుల్లో నిలువ ఉంచి మంచి ధర ఉన్నప్పుడు అమ్ముకోవచ్చని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.