గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Mar 01, 2020 , 23:55:15

న్యాక్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

న్యాక్‌ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ

వనపర్తి విద్యావిభాగం : తెలంగాణ ప్రభుత్వంచే స్థా పించబడిన నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌), ఈ జీఎంఎం వారి సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతం లోని యువతీయువకులకు మూడు నెలల పాటు ఉచిత శిక్షణ ఇచ్చి ప్రైవేట్‌ రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించనున్న ట్లు సంస్థ నిర్వహకులు గంగాధర్‌గౌడ్‌ ఆదివారం ప్రకటన లో తెలిపారు. 18-35 ఏండ్ల లోపు యువతీయువకులకు నిర్మాణ రంగంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్న ట్లు పేర్కొన్నారు. శిక్షణ సమయంలో బుక్స్‌, యూనిఫాం, బూట్లు, హెల్మెట్‌, ఉచిత హాస్టల్‌ వసతి, శిక్షణ సర్టిఫికెట్‌ ఇవ్వబడునని తెలిపారు. ఎలక్ట్రీషియన్‌, హౌజ్‌ వైరింగ్‌, వెల్డింగ్‌, శానిటేషన్‌, డ్రైవాల్‌, పాల్‌సీలింగ్‌ తదితర వా టిలో శిక్షణ ఇచ్చేందుకు పదో తరగతి పాసైన, ఫెయిలైన వారు అర్హులని, ఇంటర్‌, ఐటీఐ చదివిన వారికి ల్యాండ్‌ సర్వే, సూపర్‌వైజర్‌, స్టోర్‌ కీపర్‌, పెయింటింగ్‌, డెకరేషన్‌ తదితర వాటిలో శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. అభ్యర్థులు రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, పాస్‌ఫొటోస్‌, కుల ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని అన్నారు. 

వివరాలకు 7989050888, 8328622455 నంబర్లకు సంప్రదించాలని చెప్పారు. 

VIDEOS

logo