సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Mar 01, 2020 , 00:20:29

ప్రగతి శోభ

ప్రగతి శోభ

నారాయణపేట, నమస్తే తెలంగాణ : పట్టణాల అభివృద్ధికి వార్డుల పరిశుభ్రత తొలిమెట్టు అని కలెక్టర్‌ హరిచందన, ఎమ్మెల్యే ఎస్‌ రాజేందర్‌రెడ్డిలు అ న్నారు. పట్టణంలోని 12, 13వ వా ర్డులలో శనివారం పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌, ఎమ్మెల్యేలు హాజరయ్యా రు. ముందుగా పట్టణంలోని 12వ వార్డు లో వారు పర్యటించారు. వార్డు పరిధిలోని సామూహిక మరుగుదొడ్లను వెంటనే నిర్మించాలని, వార్డులోని ము రుగు నీరును ఊరి బయటకు పారే వి ధంగా బాహార్‌పేట వెనుక భాగంలో డ్రైనేజీ నిర్మించాలని సూచించారు. 12 వ వార్డులో  ఓ ఇంటి యజమాని ము న్సిపాల్టీ కుళాయికి నేరుగా మోటర్‌ బి గించి నీటిని వాడుతున్న విషయాన్ని గు ర్తించిన కలెక్టర్‌ వెంటనే మోటర్‌ తొలగింపజేశారు. ఆ తర్వాత 13వ వార్డులో పర్యటించి శానిటేషన్‌ వ్యవస్థను మెరు గు పరచాలని సూచించారు. అక్కడి నుంచి సరాఫ్‌ బజార్‌కు వచ్చిన వారు సరాఫ్‌ బజార్‌లోని పాత పోలీస్‌ స్టేషన్‌కు సంబంధించిన స్థలంలో ముందు భాగంలో దుకాణ సముదాయాలను నిర్మించాలని, వెనుక భాగంలో మూత్రశాలలను చేపట్టాలని సూచించారు. పత్తి బజార్‌లో గల పాత పోలీస్‌ క్వార్టర్స్‌ ప్రక్కన నిర్మించిన స్కూల్‌ భవనంలో ఓ కుటుంబం నివసి స్తుండడంతో వెంటనే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించా రు.


ఇట్టి స్కూల్‌ భవనాన్ని అంగన్‌వాడీ భవనానికి లేదా మహిళా సంఘాలకు కేటాయించాలని సూచించారు. అదే విధంగా పత్తిబజార్‌లోని అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గందె అనసూయ చంద్రకాంత్‌, వైస్‌ చైర్మన్‌ హరినారాయణబట్టడ్‌, ఐసీడీఎస్‌ సీడీపీవో జయ, ఏఎం సీ చైర్మెన్‌ సరాఫ్‌ నాగరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసులు, ఇంజియర్‌ ఖాజా హుస్సేన్‌, ఆయా వార్డుల ప్రత్యేక అధికారులు, 12, 13 వార్డుల కౌన్సిలర్లు వరలక్ష్మి కతలప్ప, నారాయణమ్మ వెంకట్రాములు పాల్గొన్నారు. కాగా పట్టణంలో గల పత్తి బజార్‌లోని ప్రభుత్వ పాఠశాల భవనంలో ఓ కు టుంబం నివసిస్తుండడంతో మీ భవనాలను మీరు సరిగా పెట్టుకోరా, ఏవరో ఆ భవనంలో నివా సం ఉంటే మీరు ఏం చేస్తున్నారని కలెక్టర్‌ కార్యాల యానికి వచ్చిన డీఈ వో రవీందర్‌పై ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి అసహానం వ్యక్తం చేశారు. 

VIDEOS

తాజావార్తలు


logo