శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Mar 01, 2020 , 00:15:55

మహిమాన్వితం శ్రీపాదవల్లభ క్షేత్రం

మహిమాన్వితం శ్రీపాదవల్లభ క్షేత్రం

మక్తల్‌ టౌన్‌ : దత్తాత్రేయుని అవతారమైన శ్రీపాదవల్లభుడు తపస్సు చేయడంతోపాటు నడయాడిన పుణ్యభూమి కురుమగడ్డ అని, మక్తల్‌ మండలంలోని పసుపుల పరిసర ప్రాంతాల ప్రజలు ఎంతో పుణ్యం చేసుకున్నారని ప్రసిద్ధ్ద హనుమంత ఉపాసకులు శ్రీనివాస గురూజీ తెలిపారు. శనివారం మండలంలోని పసుపులలో దత్తక్షేత్రంలో స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే దంపతులతో కలిసి కురుమగడ్డలోని శ్రీపాదవల్లభ క్షేత్రంలో స్వామి తపస్సు చేసిన ప్రాంతంలో పూజలు చేశారు. ఆ తర్వాత శ్రీపాద పీఠంలో స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస గురూజీతోపాటు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి దంపతులను శాలువా, పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస గురూజీ మాట్లాడుతూ శ్రీపాదవల్లభ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనది, ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా శ్రీపాదవల్లభుని దర్శించుకోవాలని పిలుపునిచ్చారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడంతో పాపాలన్నీ హరించిపోయి, సుఖసంతోషాలు దక్కుతున్నాయని తెలిపారు. మక్తల్‌ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి సైతం పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారని తెలిపారు. ప్రయాణికులకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని, క్షేత్రంలో ఉండి స్వామివారిని దర్శించి, వెళ్లాలని సూచించా రు. అంతకు ముందు గురూజీ ఎమ్మెల్యే చిట్టెంతో కలిసి కృష్ణానదిలో పుట్టీలు నడిపే జాలర్లకు లైఫ్‌ జాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి చిట్టెం సుచరితారెడ్డి, ఎంపీపీ వనజమ్మ, మార్కెట్‌ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, సర్పంచ్‌ దత్తు, ఎంపీటీసీ ఆశిరెడ్డి, రవీందర్‌రెడ్డి, రామలింగం, రాజమహేందర్‌రెడ్డి, చెన్నయ్యగౌడ్‌ పాల్గొన్నారు. 

VIDEOS

తాజావార్తలు


logo