సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Feb 27, 2020 , 23:08:05

అన్‌లైన్‌లో నిశ్చతార్థం

అన్‌లైన్‌లో నిశ్చతార్థం

మదనాపురం : ఉద్యోగ రిత్యా అమెరికా వెల్లినా మన భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలను గౌరవిస్తూ గురువారం ఓ యువజంట ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నది. వివరాల్లోకి వెళితే మదనాపురం మండల కేంద్రానికి చెందిన జక్కుల నాగన్న యాదవ్‌ అనురాధ దంపతులకు ముగ్గురు కూతుళ్ళు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో ద్వితీయ పుత్రిక సాన్విశృతి అనే అమ్మాయి ఉన్నత చదువుల కోసం 2013లో అమెరికా వెళ్ళాల్సి వచ్చింది. చదువు అనంతరం ప్రస్తుతం అక్కడే ఉద్యోగం చేస్తున్నది. ఈ క్రమంలో వరంగల్‌ జిల్లా హన్మకొండ ప్రాంతానికి చెందిన ఐలయ్య యాదవ్‌ శ్రీవాణి దంపతుల కుమారుడు వంశీ కృష్ణ సైతం అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు. వంశీ కృష్ణ సాన్విశృతిలకు మధ్యవర్తి ద్వారా వచ్చిన సంబంధం, పెద్దల నిర్ణయంతో వివాహం నిశ్చయమైనది. ముందుగా అనుకున్న ప్రకారం వీరిద్దరికి ఫిబ్రవరి-27వ తేదీన వనపర్తి జిల్లాలోనే వివాహం జరిపించాలని అనుకున్నారు. కానీ అబ్బాయికి తాను చేస్తున్న కంపెనీలో లీవ్‌ ఇవ్వక పోవడంతో ఈనెల 17న జరగాల్సిన ఎంగేజ్‌ మెంట్‌ మరియు వివాహం రద్దయ్యింది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఇరు కుటుంబాల సభ్యులు ఉండగా, అర్చకుడి సూచన మేరకు గురువారం మదనాపురం మండల కేంద్రంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో వేదపండితులు గోపిస్వామి సమక్షంలో ఏప్రిల్‌-12న అమెరికా లోనే వివాహం జరిపించాలని లగ్నపత్రిక రాసుకొని, నిశ్చయ తాంబూలాలను అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులు ఒకరికొకరు ఇచ్చిపుచ్చు కున్నారు. అనంతరం అర్చకులు చరవాణిలో మంత్రోచ్ఛారణ చేయగా, అమెరికాలో అమ్మాయి అబ్బాయి ఉంగరాలు మార్చుకున్నారు. 


VIDEOS

logo