గురువారం 04 జూన్ 2020
Narayanpet - Feb 27, 2020 , 03:42:47

భూసార పరీక్షలపై కేంద్ర బృందం తనిఖీ

భూసార పరీక్షలపై కేంద్ర బృందం తనిఖీ

వనపర్తి రూరల్‌ : సరైన పద్ధతిలో రైతులు వ్యవసాయం చేసి దిగుబడులను పెంపొందించుకోవాలని రైతులకు కేంద్ర తని ఖీ బృందం అధికారి సురేశ్‌కుమార్‌ సూచించారు. బుధవా రం మండలంలోని వెంకటపురం గ్రామంలో భూసార పరీక్షల కోసం ఫైలెట్‌ గ్రామంగా ఎంపికైన సందర్భంగా అకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం రైతులతో తనిఖీ బృందం అధికారి సురేశ్‌కుమార్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సు ధాకర్‌రెడ్డిలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా 2019 -20 సంవత్సరంగా మండలంలోని వెంకటపురం గ్రామా న్ని ప్రత్యేక ఫైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ఇక్కడి వ్యవసాయ పొలాలలోని భూసార పరీక్షలు నిర్వహించిన రైతుల కు కార్డులను అందజేశామన్నారు. వాటితో రైతులకు ఎంతవరకు ఉపయోగం ఉందని రైతులను అడిగి తెలుసుకున్నా రు. పొలంలో ఎరువు ఎంత మోతాదులో వాడాలనే విష యం కార్డులో నమోదు చేయడం జరిగిందని రైతులు తెలిపారు. రెండు సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్ష లు నిర్వహించాలన్నారు. వనపర్తిలోని వ్యవసాయ మార్కెట్‌లో ఉన్న భూసార పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేశారు. కార్యక్రమంలో భూసార పరీక్ష కేంద్ర సహాయ సం చాలకుడు ఆంజనేయులుగౌడ్‌, వ్యవసాయాధికారులు కురుమయ్య, రవికుమార్‌, మురళీధర్‌, ఏఈవోలు వంశీ, సునీల్‌ పాల్గొన్నారు.

గోపాల్‌పేటలో..

గోపాల్‌పేట : మండలంలోని జయన్నతిరుమలాపూర్‌ గ్రా మంలో 2019-20 సంవత్సరంలో వ్యవసాయ శాఖ అధికారులు చేసిన భూసార పరీక్షలపై బుధవారం కేంద్ర బృం దం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో ఏర్పాటు చేసి న సమావేశంలో బృందం సభ్యుడు సురేశ్‌కుమార్‌ మా ట్లా డుతూ భూసార పరీక్షల వల్ల ఫలితాలు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. పరీక్షలకు ముందు, తరువాత ఎంత మోతాదులో ఎరువులు వాడుతున్నారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ సంయుక్త సంచాలకులు అంజయ్యగౌడ్‌, వ్యవసాయ విస్తరణ అధికారి సుధాకర్‌రెడ్డి, మురళి, వెంకటేశ్‌, రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్‌ గోపాల్‌, సర్పంచ్‌ లక్ష్మీకళ, రైతులు పాల్గొన్నారు.


logo