శుక్రవారం 05 మార్చి 2021
Narayanpet - Feb 26, 2020 , 01:11:46

ప్రతి ఒక్కరూ ఓ కేసీఆర్‌ కావాలి

ప్రతి ఒక్కరూ ఓ కేసీఆర్‌ కావాలి

కల్వకుర్తి, నమస్తే తెలంగాణ : మున్సిపాలిటీల అభివృద్ధికి చైర్మన్‌, కౌన్సిలర్లు, వార్డు కమిటీ స భ్యులు ప్రతి ఒక్కరూ కేసీఆర్‌ కావాలని పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నా రు. పట్టణ ప్రగతిలో భాగంగా నాగర్‌కర్నూల్‌ జి ల్లా కల్వకుర్తి పట్టణంలోని రాయల్‌ ప్యాలెస్‌లో మంగళవారం కౌన్సిలర్లు, వార్డు కమిటీ సభ్యుల కు కొత్త మున్సిపల్‌ చట్టం, పల్లెప్రగతిలో చేపట్టాల్సిన అంశాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చే శారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడు తూ కొత్త మున్సిపల్‌ చట్టంలో ప్రజలకు అధికారాలతో పాటు బాధ్యతలూ ఇచ్చిందని, వాటిని చా లా అనర్థాలు జరుగుతాయన్నారు. మున్సిపాలిటీ లు బాగుపడాలన్న ఉద్ధేశంతో సీఎం కేసీఆర్‌ ప ట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించారని, 10 రోజుల పాటు పట్టణంలోని ప్రతి సమస్యను గు ర్తించి సమగ్ర ప్రణాళిక తయారుచేసుకుందామన్నారు. పట్టణప్రగతితో రాత్రికి రాత్రే బల్దియాలు అభివృద్ధి చెందుతాయనే అపోహలో ఉండొద్దని, ప్రభుత్వం వద్ద అల్లాఉద్దీన్‌ అద్భుత దీపం ఏమీ ఉండదన్నారు. ప్రజల్లో అవగాహన పెంచుతూ, నాగరిక సమాజ నిర్మాణంలో పాత్రదారులుగా చేసేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

నెలలో 70 టాయిలెట్స్‌ నిర్మించాలి..

కల్వకుర్తిలో దాదాపు 50 వేల జనాభా ఉంద ని, రెండు హైవేలు కల్వకుర్తి నుంచి వెళ్తున్న క్రమం లో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు చాలా మంది వస్తుంటారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం నాలుగు టాయిలెట్లు ఏ విధంగా సరిపోతాయని మున్సిపల్‌ చైర్మన్‌ను ప్రశ్నించారు. నెల లో 70 టాయిలెట్లు నిర్మించేలా సంకల్పం తీసుకోవాలన్నారు. 

చెత్త బుట్టలను సద్వినియోగించుకోండి..

ఇప్పటివరకు కల్వకుర్తి మున్సిపాలిటీలో ఎన్ని చెత్త బుట్టలు పంపిణీ చేశారు..? వాటిని ఎంత మంది వినియోగిస్తున్నారు..? అని మంత్రి కేటీఆ ర్‌ ప్రశ్నించారు. అందరూ ఉపయోగిస్తున్నామని సమాధానం చెప్పడంతో మీరు అబద్దం చెబుతున్నారన్నారు. ‘తాను దేవరకొండ పర్యటనకు వె ళ్లిన క్రమంలో ఒక ఇంట్లోకి వెళ్లి చెత్తబుట్టలు ఎక్క డ ఉన్నాయని ప్రశ్నించాను.. తీరా చూస్తే  తడి, పొడి చెత్త బుట్టల్లో బియ్యం, పప్పులు పోసుకున్నారు..’ అని చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన బుట్ట ల్లో చెత్త వేయకుండా ఇతర అవసరాలకు వినియోగిస్తున్నారని, అలాకాకుండా చెత్తకు మాత్రమే వినియోగించుకోవాలన్నారు. ఇంటిలాగే పట్టణాన్ని కూడా శుభ్రంగా ఉంచుకుందామని పిలుపునిచ్చా రు. అవసరమైతే అందరికీ మరోసారి చెత్త బుట్ట లు పంపిణీ చేయాలని మున్సిపల్‌ కమిషనర్‌, చై ర్మన్లకు సూచించారు. 

మౌలిక సదుపాయాల కల్పనకే..

గ్రామాలు, బల్దియాల్లో మౌలిక సదుపాయా లు, పరిశుభ్రత కోసం ప్రతి జిల్లాకు అదనపు కలెక్టర్‌ను నియమించిందని మంత్రి కేటీఆర్‌ చెప్పా రు. అదనపు కలెక్టర్‌తో పాటు కలెక్టర్‌, మంత్రు లు, ఎమ్మెల్యేలు పట్టణప్రగతిపై సమీక్షిస్తారని వివరించారు. అందరం కలిసికట్టుగా గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చేసుకుందామని, దీనిపై వార్డు కమిటీ సభ్యులు, కౌన్సిలర్లు ప్రజలకు వివరించాలన్నారు. 

జపాన్‌, సింగపూర్‌ మాదిరిగా మార్చుకుందాం..

పరిశుభ్రతలో జపాన్‌, సింగపూర్‌ల మాదిరిగా పట్టణాలు, గ్రామాలను మార్చుకుందాని మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. ఆ దేశాల్లో ఉన్న అనుభవాలను వివరించారు. ‘తాను పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జపాన్‌ నగరంలోని టోక్యో వెళ్లాను. అక్కడ రెండు, మూడు రోజులు చూసినా ఎక్కడా చిన్నపాటి చెత్త కనిపించలేదు. ఈ విషయంపై జపాన్‌లోని అంబసీ మిత్రుడిని అడగగా, మేము పరిసరాలను అపరిశుభ్రంగా మారిస్తే కదా.. మీకు ఎక్కడైనా చెత్త కనిపించేది అని సమాధానమివ్వడంతో నిర్ఘాంతపోయాను. ఇంకో సందర్భంలో కుటుంబంతో కలిసి సింగపూర్‌కు వెళ్లాను. అక్కడ దిగగానే అప్పట్లో ఆరేండ్ల వయస్సున్న కూతురుకు చెత్త బయట వేయొద్దని చెప్పాను. వేస్తే ఏం జరుగుతుందని నన్ను ప్రశ్నించింది.. చెత్తను బయటేస్తే మొదటి సారి 500 డాలర్లు, రెండో సారి 1000 డాలర్లు, మూడోసారి జైలు శిక్ష అని రాసి ఉన్న బెర్డులను చూసి నా కుమార్తె చాక్లెట్‌ కవర్లను బయట పడేయకుండా జేబులో వేసుకున్నది.’ అక్కడి లాగా మనం కూ డా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని పిలుపునిచ్చారు. అందుకే మన సీఎం కేసీఆర్‌ కొత్త మున్సిపల్‌ చట్టంలో ప్రజలకు అధికారాలు, బాధ్యతలు ఇచ్చారని, విస్మరిస్తే తగిన జరిమానలు కూడా విధించేలా పొందుపరిచారని చెప్పారు. 

అవినీతి ప్రక్షాళన చేసేందుకు..

మున్సిపాలిటీల్లోని అవినీతిని ప్రక్షాళన చేసేందుకు కొత్త మున్సిపల్‌ చట్టంతో అనేక అంశాలు పొందుపరిచామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. 75 గజాల వారు ఇళ్లు కట్టుకుంటే కేవలం ఒక రూపా యి మాత్రమే చెల్లించాలని, 600 గజాల లోపు వారు ఇళ్లు నిర్మించుకుంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు లు చేసుకోవాలని వివరించారు. 21 రోజుల్లోగా అనుమతులు వస్తాయని, రాకుంటే 22వ రోజు ఇంటి నిర్మాణ పనులు చేసుకోవచ్చని వివరించారు. సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాలని, దాని ఉల్లంఘిస్తే 25 శాతం జరిమాన విధించనున్నట్లు తెలిపారు. 

నాలుగు అంశాలపై దృష్టి సారించాలి..

పట్టణప్రగతిలో ప్రధానంగా వార్డు పరిశుభ్రత, మొక్కల పెంపకం, మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సరఫరా అంశాలపై దృష్టి సారించాలని వార్డు కమిటీ సభ్యులు, కౌన్సిలర్లకు దిశా నిర్దేశం చేశారు. పాత గోడలను తొలగించాలని, ఖాళీ ప్లా ట్లను శుభ్రం చేసేలా యజమానులకు నోటీసులివ్వాలని, మట్టి కుప్పలను తొలగించాలని, పాడైపోయిన, వంగిపోయిన, రోడ్లకు అడ్డంగా ఉన్న వి ద్యుత్‌ స్తంభాలను తొలగించి, విద్యుత్‌ వైర్లను సరిచేయాలని చెప్పారు. అన్ని వసతులతో వైకుంఠధామాలు, ఖబ్రస్థాన్‌ నిర్మించాలని, అత్యాధునిక వసతులతో ఇంటిగ్రెటెడ్‌ మార్కెట్‌ నిర్మించుకోవాలని, పార్కులు, ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. అక్రమ వెంచర్‌లపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

మొక్కలు ఎక్కువగా నాటి సంరక్షించాలి..

ప్రతి వార్డులో మొక్కలు ఎక్కువగా నాటి, సం రక్షించుకోవాలని కౌన్సిలర్లకు సూచించారు. 85 శాతం మొక్కలు బతికాలని, లేని పక్షంలో పదవి పోతుందని హెచ్చరించారు. కొత్త మున్సిపల్‌ చ ట్టంలో ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయని, అందునే తాను బాధ్యత, అధికారం, పర్యవసా నం అనే అంశాలను ముందుగానే చెప్పానని వివరించారు. వార్డు కౌన్సిలర్లు గట్టిగా అనుకోవాలని, అభివృధ్దే ధ్యేయంగా ముందుకు సాగాలన్నారు. కేసీఆర్‌ ఒక్కడే తెలంగాణ సాధించలేదా.., ఇదేంత పని.., తానే ఒక కేసీఆర్‌నని కౌన్సిలర్లు అనుకుని ముందుకు సాగాలని చెప్పారు. కార్యక్రమంలో ఢి ల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి మంద జగన్నా థం, మున్సిపాలిటీల పరిపాలన సంచాలకులు స త్యనారాయణ, నాగర్‌కర్నూల్‌ కలెక్టర్‌ శ్రీధర్‌, అడిషనల్‌ కలెక్టర్‌ మనుచౌదరి, ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్‌, మర్రి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కశిరెడ్డి నా రాయణరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్‌, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కి ష్టారెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బాలాజీ సింగ్‌, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయ కుడు గోళి శ్రీనివాస్‌ రెడ్డి తదితరులు ఉన్నారు. 

VIDEOS

logo