సోమవారం 01 మార్చి 2021
Narayanpet - Feb 26, 2020 , 01:09:26

ఆలయ భూములను పరిరక్షించాలి

ఆలయ భూములను పరిరక్షించాలి

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ: పట్టణంలోని శ్రీ వేంకటేశ్వర స్వామిదేవాలయానికి చెందిన భూమి ఆక్రమణకు గురవుతున్న నేపథ్యంలో భూముల పరిరక్షణకు దేవదాయశాఖ నడుం బిగించింది. ఈ నేపథ్యంలో మంగళవారం దే వదాయశాఖ భూముల పరిరక్షణ విభా గం స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ రమాదేవి స్థానిక ఆలయ భూములను సందర్శించి పరిశీలించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆలయ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. ఆలయ భూముల్లో సమాధులను పెట్టడం అపచారమన్నారు. ప్రధాన రహదారికి అనుకొని ఉన్న దాదాపు 42 ఎకరాల భూమి ఆక్రమ ణ కు గురైన పరిస్థితిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు పట్టణంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం భూ ములు సర్వే నంబర్‌ 430 (10.95), 439 (15.13), 441 (16.55) వారీగా మొత్తంగా 42.63 ఎకరాల భూమి ఉంది. దీనిలో కొంతమంది అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై దేవదాయ శాఖ ట్రిబ్యునల్‌లో కేసులు నమోదు చేయనున్నట్లు చెప్పారు. దేవదాయశాఖకు చెందిన భూమిగా ప్రచార బోర్డును ఏర్పాటు చేయాలని సూచించారు. ఇప్పటికే ఈ భూమి చదును కోసం కురుమూర్తి స్వామి దేవస్థానం నుంచి రూ. 2 లక్షలు ఖర్చు చేసినట్లు చెప్పారు. స్థానికంగా ఉన్న పరమేశ్వరస్వామి ఆలయం భూమి ఆక్రమణలపై సహితం తొందరలో పర్యటించి పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఈ ప్రత్యేక డ్రైవ్‌ ద్వార మక్తల్‌ మం డలం కర్నిలో గుంటి రంగనాథస్వామి ఆలయానికి చెందిన 64 ఎకరాల భూమిని స్వాధీ నం చేసుకున్నట్లు చెప్పారు. అదేవిధంగా వనపర్తి మండలం అజ్జకొల్లులో ఆంజనేయస్వామి ఆలయానికి చెందిన 33 ఎకరాలను స్వాధీనపర్చుకున్నట్లు తెలిపారు. దేవదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ వెంకటాచారి, తాసిల్దార్‌ జెకెమోహన్‌ తదితరులు పాల్గొన్నారు. 

వైభవంగా స్వామివారి రెండో సవారి

ఆత్మకూరు, నమస్తే తెలంగాణ: ఉత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామివారి రెండో సవారి వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయంలో భక్తులు విశేష పూజలు నిర్వహించగా.. రాత్రి స్వామివారి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గాయిత్రి రవికుమార్‌యాదవ్‌ దంపతులు పరమేశ్వరస్వామి ఆలయంలో ప్ర త్యేక పూజలు చేశారు. ఎంపీపీ బంగారు శ్రీనివాసులు, వైస్‌ ఎంపీపీ కోటేశ్వర్‌, పీఏసీఎస్‌ అధ్యక్షుడు గాడి కృష్ణమూర్తి, వైస్‌ చైర్మెన్‌ విజయభాస్కర్‌రెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్లు తేరు మైదానంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు స్వామివారి పల్లకి సేవను స్థానిక వేంక టేశ్వరస్వామి దేవాలయం నుంచి పురవీధుల గుండా పరమేశ్వర స్వామి ఆలయానికి ఊరేగిస్తూ తీసుకొచ్చారు. చైర్‌పర్సన్‌ దంపతుల నేతృత్వంలో ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు, నాయకులు భారీ సంఖ్యలో ఊరేగింపులో పాల్గొన్నారు. 

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు స్థలం కేటాయింపు

వనపర్తి రూరల్‌ : మండలంలోని చిమనగుంటపల్లి శివారులో గల ప్రభుత్వ స్థలాన్ని విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిందని విద్యుత్‌ ఎడీ చక్రవర్తి మంగ ళవారం తెలిపారు. గతంలో కేటాయించిన స్థలానికి రోడ్డు లేకపోవడంతో నిర్మాణం చే యలేదని, ప్రస్తుతం చిమనగుంటపల్లి గ్రామశివారులోని మరో భూమిని ప్రభుత్వం కే టాయించడం జరిగిందని త్వరలోనే సబ్‌స్టేషన్‌ నిర్మాణాలు చేపడుతామని తెలిపారు.

బాధితుడికి ఎల్‌వోసీ పంపిణీ 

వనపర్తి, నమస్తే తెలంగాణ: అనారోగ్య బారిన పడి మెరుగైన చికిత్స చేయించుకునేందుకు  సీఎం సహాయనిధి దరఖాస్తు చేసుకున్న వనపర్తి మండలం నాగమ్మతండాకు చెందిన సాలమ్మ చి కిత్స నిమిత్తం  విడుదలైన రూ. లక్ష  50వేలు వి లువ గల ఎల్‌వోసీ మంత్రి  సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి మంగళవారం ఆయన హైదరాబాద్‌లోని త న ఛాంబర్లో  అందజేశారు.  కార్యక్రమంలో బా ధిత కుటుంబసభ్యుడు పాల్గొన్నారు. 

VIDEOS

logo