శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 26, 2020 , 01:08:10

ప్లాస్టిక్‌ రహిత మున్సిపాలిటీగా మారుస్తాం

ప్లాస్టిక్‌ రహిత మున్సిపాలిటీగా మారుస్తాం

వనపర్తి, నమస్తే తెలంగాణ: ప్రభుత్వం అమలు చేస్తున్న 10రోజుల కార్యచరణతో ప్రణాళికతో వనపర్తి రూపురేఖల ను మారుతుందని, ప్లాస్టిక్‌ రహిత మున్సిపాలిటీగా  మారుస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ గట్టుయాదవ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌ అన్నారు. 10రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగం గా చేపట్టిన కార్యక్రమంలో రెండోరోజు (మంగళవారం) పట్టణంలోని 3వ, 7వ, 17వ, 30వ వార్డులలో  వార్డు ప్రత్యే కాధికారులు ప్రజలు, నాయకులతో కలిసి పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు  మాట్లాడుతూ... రా ష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలలో అమ లు చేసిన 30రోజుల కార్యాచరణ ప్రణాళికకు మంచి స్పందన వచ్చిందని, ఆ అనుభవంతో నే మున్సిపాలిటీ పట్టణాలలో కూడా 10రోజుల కార్యాచరణకు ప్రభుత్వం శ్రీకా రం చుట్టినట్టు వారు  తెలిపారు. మురికి కా ల్వలను శుభ్రం చేయడం, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లడం, దోమల బెడద లేకుండా ఫాగింగ్‌ చేయడం, పాడుబడిన బావులను చేయడం వంటివి పట్టణ ప్రాంత పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా చేపడుతున్నామని వారు  తెలిపారు. విద్యుత్‌ సమస్యలపై  వంగిపోయిన స్తంభాలను, వేలాడుతున్న కరెంట్‌ వైర్లు గుర్తించి మూడు నెలల్లో పరిష్కరిస్తామని, వీధిలైట్లు మాత్రం 15రోజుల్లో ఏర్పా టు చేయడం జరుగుతుందన్నారు.  10రోజలు కార్యాచరణలో భాగంగా హరితహా రం కింద ఇంటింటికీ 5 మొక్కలను పం పిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆ యా వార్డుల కౌన్సిలర్లు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. 

సమగ్రాభివృద్ధి కోసమే పట్టణ ప్రగతి

పెబ్బేరు: పట్టణ సమగ్రాభివృద్ధికోసమే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్‌ ప్ర భుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎద్దుల కరుణశ్రీ  అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా రెండో రోజు మంగళవారం చైర్‌పర్సన్‌ 1వ వార్డు, 2వ వార్డులో కౌన్సిలర్‌ అక్కమ్మ, మూడో వార్డులో పార్వతి, నాల్గో వార్డులో కౌన్సిల ర్‌ సువర్ణ, 5వ వార్డులో గోపిబాబు, ఆరో  వార్డులో రామకృష్ణ, ఏడోవార్డులో ఎల్లస్వామి, ఎనిమిదో వార్డులో చిన్న ఎల్లారెడ్డి, 9వ వార్డులో అశ్విని, పదోవార్డులో పద్మ, 11వ వార్డులో వైస్‌ చైర్మన్‌ కర్రెస్వామి, 12వ వార్డులో సుమతి తాగునీరు సమస్య, పారిశుధ్యం, డ్రైనేజీ, విద్యుత్‌ స్తంభాల తొలగింపు, వేలాడుతున్న విద్యుత్‌లైన్లకు మరమ్మతులు తదితర పనుల చర్యలు చేపట్టా రు. చైర్‌పర్సన్‌ కురణశ్రీ వార్డుల్లో చేపడుతు న్న పనులను పరిశీలించారు. పట్టణ ప్రగతి లో భాగంగా ప్రజలను భాగస్వాములుగా పరుస్తూ పది రోజులలో పట్టణాన్ని రూపురేఖలు మారుస్తామని ఆమె తెలిపారు.  కార్యక్రమంలో కమిషనర్‌ చలపతి, మేనేజర్‌ రమేశ్‌ నాయక్‌, ఆయా వార్డుల కౌన్సిలర్లు, ప్రత్యేక అధికారులు, మున్సిపల్‌ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

VIDEOS

logo