బుధవారం 03 జూన్ 2020
Narayanpet - Feb 25, 2020 , 01:02:51

నేడు డీసీసీబీ నామినేషన్ల ఘట్టం

నేడు డీసీసీబీ నామినేషన్ల ఘట్టం

మహబూబ్‌నగర్‌ ప్రధాన ప్రతినిధి/నమస్తే తెలంగాణ : జిల్లా సహకార ఎన్నికల ప్రధాన ఘట్టానికి వేలైంది. మంగళవారం జిల్లా సహకార సంఘం ఎ న్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరించనున్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సొసైటీ (డీసీఎంస్‌) ఎన్నికల అధికారులు డీసీసీబీ బ్యాంకు వద్ద ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వెంటనే 1:30 గంటల నుంచి 3 గంటల వరకు నామినేషన్ల పరిశీలన కార్యక్రమం ఉంటుంది. 3 గంటల తర్వా త అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రచురిస్తారు. తర్వా త మధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. 5 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితా, వారికి కేటాయించిన గుర్తులతో సహా నోటీసు బోర్డులో ప్రచురిస్తారు. ఈనెల 28న పోలింగ్‌, అదే రోజు ఫలితాలు సై తం వెల్లడిస్తారు. మరుసటి రోజు పాలకవర్గాల ఎన్నికలు జరుగుతాయి. ఇప్పటికే మహబూబ్‌నగర్‌ జి ల్లా సహకార సంఘం పరిధిలోని 87 మంది పీఏసీఎస్‌ చైర్మన్లు డీసీసీబీ ఎ కేటగిరీలో పోటీ చేసేందుకు, ఓటేసేందుకు అర్హత సాధించారు. ఇక డీసీఎంస్‌ పరిధిలో 87 సంఘాల పరిధిలో 72 సంఘాలకు మా త్రమే ఓటు హక్కు ఉండటంతో 15 మంది ఓటింగ్‌కు దూరంగా ఉండనున్నారు. డీసీసీబీలో 20, డీసీఎంస్‌లో 10 డైరక్టర్ల స్థానాలకు ఈనెల 28న పో లింగ్‌ జరుగనుంది. 


డీసీసీబీ, డీసీఎంస్‌ కోసం పోటీలో..

డీసీసీబీ కోసం జిల్లాలోని 87 పీఏసీఎస్‌ల నుంచి ఎన్నికైన చైర్మన్లు 20 డైరెక్టర్లలో 16 మందిని ఎన్నుకోవాల్సి ఉంది. మరో నలుగురు డైరెక్టర్లను బి కేటగిరీకి చెందిన ఇతర సంఘాల చైర్మన్లు (జిల్లా సహకార సంఘం పరిధిలో 35 మంది ఉన్నారు) ఎన్నుకుంటారు. ఇక డీసీఎంస్‌ పరిధిలో ఉన్న 10 డైరెక్టర్ల స్థా నాల కోసం జిల్లాలోని ఎ కేటగిరీ పరిధిలో 6 స్థానా లు, బి కేటగిరీ పరిధిలో 4 స్థానాలున్నాయి. ఎ కేటగిరీ నుంచి పోటీ చేసేందుకు 87 పీఏసీఎస్‌ చైర్మన్లలో 72 మందికే అవకాశం ఉంది. 15 పీఏసీఎస్‌లకు డీ సీఎంస్‌లో సభ్యత్వం లేనందున వారు పోటీ చేసేందుకు, ఓటేసేందుకు అవకాశం ఉండదు. బి కేటగిరీ పరిధిలో ఉన్న 4 స్థానాలకు సభ్యత్వం ఉన్న ఇతర సంఘాల (చేనేత సహకార సంఘాలు, మత్స్య సహకార సంఘాలు, ఉన్ని సహకార సంఘాలు, చేనేత సహకార సంఘాలు మొదలైనవి) చైర్మన్లు పోటీ చే సేందుకు, ఓటేసేందుకు అవకాశం ఉంటుంది. 


డైరెక్టర్‌ అభ్యర్థులపై ఉత్కంఠ..

మహబూబ్‌ నగర్‌ జిల్లా సహకార సంఘం పరిధిలోని 87 పీఏసీఎస్‌లలో 83 పీఏసీఎస్‌లు టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతున్న అభ్యర్థులే కైవసం చేసుకున్నా రు. ఈ నేపథ్యంలో అన్ని డైరెక్టర్‌ స్థానాలు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులే కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తున్నది. అయితేచ ఆ అభ్యర్థులెవరనే అంశంపైన నెలకొన్న ఉత్కంఠ రేపు నామినేషన్లు దాఖలు చేసే సమయం వరకు నెలకొననున్నది. సీల్డ్‌ కవర్‌లో పో టీ చేసే అభ్యర్థుల జాబితాను రేపు పంపించనున్నారని పార్టీ నేతలు తెలిపారు. డీసీసీబీలో 20 డైరెక్టర్‌ స్థానాలకు గాను 5 స్థానాలు, డీసీఎంస్‌లో 10 స్థానాలకు గాను 3 స్థానాలు భర్తీ అయ్యే పరిస్థితి లేదు. ఎ స్సీ, ఎస్టీలకు కేటాయించిన ఈ స్థానాల్లో రిజర్వేషన్‌ అభ్యర్థులు అందుబాటులో లేరు. డీసీసీబీలో 15, డీసీఎంస్‌లో 7 స్థానాలు మాత్రమే భర్తీ అయ్యే అవకాశం కనిపిస్తున్నది. డైరెక్టర్లుగా ఎంపికయ్యే ఈ అ భ్యర్థుల నుంచే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులు ఎంపికవుతారు. డైరెక్టర్ల స్థానాలకు ఎ కేటగిరీ నుంచి స రిగ్గా పీఏసీఎస్‌ల నుంచి సరిగ్గా 16 మంది జాబితా, డీసీఎంస్‌లకు ఎ కేటగిరీ నుంచి కూడా సరిగ్గా 6 మంది జాబితా నేడు అధిష్ఠానం నుంచి వస్తుందని టీఆర్‌ఎస్‌ నేతల నుంచి విశ్వసనీయ సమాచారం. తొలుత డైరెక్టర్ల స్థానాలు ఖరారు చేశాక ఈనెల 29 నాటికి చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ అభ్యర్థులెవరనే అంశాన్ని అధిష్ఠానం నిర్ణయిస్తుందని తెలుస్తున్నది logo