శ్రీరామ కొండంత జనం

కోయిలకొండ: శ్రీరామ నామస్మరణతో శ్రీరామకొండ గిరులు పులకించాయి. ఆదివారం అమావాస్య పర్వదినం సందర్భంగా లక్షలాదిమంది భక్తులు శ్రీరామకొండకు తరలొచ్చారు. ఏడాది తర్వాత వచ్చిన ఆదివారం అమావాస్య శ్రీరామకొండ దర్శనానికి శనివారం రాత్రి నుంచే వివిధ ప్రాంతాలనుంచి భక్తులు రామకొండకు తరలొచ్చి అఖండ భజనలు నిర్వహించారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీరామచంద్ర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రామకొండపై స్వామిని దర్శించుకొని తమ వెంట పవిత్ర కోనేరు నీరు, ఔషదమూళికల కొమ్మలను ఇంటికి తీసుకెళ్లారు. ఎండ తీవ్రత లెక్క చేయడకుండా వృద్ధులు, మహిళలు శ్రీరామకొండకు తరలివచ్చారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో భక్తులకు కొండ కింద, కొండపై భాగంలో తాగునీటి సౌకర్యం కల్పించారు. రామకొండ ఆదివారం అమావాస్యకు ముస్లింలు కూడా వచ్చి స్వామిని దర్శించుకున్నారు.
రామనామస్మరణతో పులకింత
శివరాత్రికి ఆదివారం అమావాస్య రావడంతో జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల భక్తులు రామకొండకు తరలివచ్చారు. రామదర్శనం చేసుకొని తన్మయం పొందారు. కోరిన కోర్కెలు తీర్చె శ్రీరామకొండ రామస్వామికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు రామ నామస్మరణతో రామకొండ గిరిలు పులకించాయి. శ్రీశైలం వెళ్లిన శివస్వాములు నేరుగా రామకొండకు వచ్చి దర్శనం చేసుకొన్నారు.
తాజావార్తలు
- ప్రిన్స్ సల్మాన్ ఆదేశాల ప్రకారమే జర్నలిస్టు ఖషోగ్గి హత్య
- ఎన్టీఆర్ మాస్క్‌పై చర్చ.. ధర తెలుసుకొని షాక్..!
- చైనా వ్యాక్సిన్‌ను పక్కన పెట్టిన శ్రీలంక
- నేడు టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం
- సోదరిని ఫాలో కావొద్దన్నందుకు చితక్కొట్టారు
- నేడు ఇండియా టాయ్ ఫేర్-2021.. ప్రారంభించనున్న మోదీ
- మహిళపై అత్యాచారం.. నిప్పంటించిన తండ్రీకుమారుడు
- ఆటబొమ్మల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం
- జమ్మూలో ఉగ్రవాదుల భారీ డంప్ స్వాధీనం
- కరీంనగర్ జిల్లాలో పార్థీ గ్యాంగ్ కలకలం