గురువారం 04 జూన్ 2020
Narayanpet - Feb 22, 2020 , 05:06:26

రైతుబంధు సంబురం

రైతుబంధు సంబురం

యాసంగి పంట పెట్టుబడి సాయం డబ్బులొచ్చాయి. తొలి విడుతగా రూ.128.18 కోట్లు అన్నదాత బ్యాంక్‌ ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో 1,03,687 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. జిల్లాలో మరో 15,121 మంది రైతుల ఖాతాల్లో ఇంకా రూ.59.32 కోట్లు జమ కావాల్సి ఉంది.

  • తొలి విడుతగా.. రూ.128.18 కోట్లు
  • 1,03,687 మంది రైతులకు ప్రయోజనం
  • మార్చిలోగా మిగిలిన రైతుల ఖాతాల్లోకి..
  • ఆనందం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు

యాసంగి పంట పెట్టుబడి సాయం డబ్బులొచ్చాయి. తొలి విడుతగా రూ.128.18 కోట్లు అన్నదాత బ్యాంక్‌ ఖాతాల్లో జమ అయ్యాయి. దీంతో 1,03,687 మంది రైతులకు ప్రయోజనం చేకూరింది. జిల్లాలో మరో 15,121 మంది రైతుల ఖాతాల్లో ఇంకా రూ.59.32 కోట్లు జమ కావాల్సి ఉంది. మార్చి చివరి నాటికి మిగితా వారికి కూడా పైసలు అందుతాయని, ఎవరూ ఆందోళన చెందొద్దు.. అర్హులందరికీ అందిస్తామని అధికారులు భరోసా కల్పిస్తున్నారు. కర్షకులకు అండగా నిలువాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తోంది. దీంతో కర్షక కుటుంబాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.  - నారాయణపేట ప్రతినిధి/నమస్తే తెలంగాణ


నారాయణపేట ప్రతినిధి/నమస్తే తెలంగాణ : రైతుల మోముల్లో రైతుబంధు ఆనందం వెల్లివిరుస్తోంది. ఖాతాలలో ఈ పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతుండటంతో మురిసిపోతున్నారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించిన నేపథ్యంలో పంటల దిగుబడి బాగా వచ్చింది. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం కింద నాలుగో విడుత డబ్బులు వారి వారి బ్యాంక్‌ ఖాతాలలో జమ అవుతుండటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 


యాసంగి వివరాల  మేరకే..

  గత యాసంగి సీజన్‌లో అధికారులు నమోదు చేసిన వివరాల ప్రకారమే రైతుబంధు నిధులు వానకాలం పంటకు సంబంధించి జమ అవుతున్నాయి. ఏటాఎకరాకు రూ.10 వేలు అన్నదాతల ఖాతాలలో అధికారులు జమ చేస్తున్నారు. నెల రోజులుగా దశల వారీగా ఈ ప్రక్రియ కొనసాగుతోంది. వచ్చే నెలాఖరు వరకు అర్హులైన వారి ఖాతాలలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది. 


రూ.128.18 కోట్లు జమ

  నాలుగో విడుత రైతుబంధు పథకంలో భాగంగా ఇప్పటి వరకు 1,03,687 మంది  రైతుల ఖాతాలలో రూ.128,18,56,334 జమ అయ్యాయి. జిల్లాలో మరో 15,121 మంది రైతుల ఖాతాలలో ఇంకా రూ.59.32 కోట్లు జమ కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ మార్చి నెలాఖరు వరక పూర్తి కానున్నది. జిల్లాలో గత యాసంగి సమయంలో వివరాలను నమోదు చేసుకున్న రైతుందరికీ పెట్టుబడి సాయం జమ కానున్నది. 


వెల్లివిరుస్తున్న ఆనందం

   పంటలు బాగా పండి మంచి లాభాలలో ఉన్న అన్నదాతలు తమ తమ ఖాతాలలో రైతుబంధు పథకం డబ్బులు జమ అవుతుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో తాము  చేసుకున్న అప్పులు తీర్చుకోవడంతోపాటు తమ అవసరాలకు, మున్ముందు తమ వ్యవసాయాన్ని మరింతగా మెరుగు పర్చుకోవడానికి వీలుగా ఉపయోగించుకోవడానికి రైతులు సన్నద్ధమవుతున్నారు. డబ్బులు జమ కాని రైతులు మాత్రం ఎదురుచూస్తున్నారు.

 

మార్చిలోపు అందరి ఖాతాల్లోకి..

మార్చి నెలలోపు రైతులందరి ఖాతాల్లోకి రైతుబంధు పెట్టుబడి సాయం జమ కానున్న ది. యాసంగి సీజన్‌లో వివరాలు నమోదు చేసిన వారికి ఈ సాయం అందిస్తాం. ఇప్పటికే పలువురు రైతుల ఖాతాల్లో వేశాం.. మిగిలిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.       - జాన్‌ సుధాకర్‌, ఏవో, నారాయణపేట 


logo