శుక్రవారం 05 జూన్ 2020
Narayanpet - Feb 22, 2020 , 04:55:16

దర్శనమిచ్చిన మాతా మాణికేశ్వరి

దర్శనమిచ్చిన మాతా మాణికేశ్వరి

దామరగిద్ద : కర్ణాటక రాష్ట్రం యానగుంది మాణిక్యగిరి శివరాత్రి వేడుకల సందర్భంగా శివనామస్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా మాతా మాణికేశ్వరి భక్తులకు దర్శనం ఇచ్చారు.

  • భారీగా తరలొచ్చిన భక్తులు
  • దర్శనభాగ్యంతో పులకరింత
  • ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
  • బందోబస్తు నిర్వహించిన పోలీసులు

దామరగిద్ద : కర్ణాటక రాష్ట్రం యానగుంది మాణిక్యగిరి శివరాత్రి వేడుకల సందర్భంగా శివనామస్మరణతో మార్మోగింది. ఈ సందర్భంగా మాతా మాణికేశ్వరి భక్తులకు దర్శనం ఇచ్చారు. మాతా మాణికేశ్వరి నడవలేని స్థితిలో ఉండటంతో మాతా భక్తులు శివయ్యస్వామి మాతను వీల్‌చేర్‌పై తీసుకొచ్చి భక్తులకు దర్శనం చేయించారు. మాతా ముందు నుంచి కూడా అహింసా మార్గంలో నడవాలని, జీవ హింస చేయకూడదని భక్తులకు ప్రవచనం చేసే వారని అక్కడికి వచ్చిన భక్తులు పేర్కొన్నారు. అక్కడికి మాత దర్శనార్థం వచ్చిన భక్తులకు భోజన వసతి, మంచి నీటి సౌకర్యం తదితర సౌకర్యాలు ఆలయ కమిటీతో పాటు ఇతర భక్తులు కూడా ఇతర భక్తులకు పండ్లు, ఫలహారం, శుద్ధజలం ప్యాకెట్లు పంపిణీ చేశారు. 


logo