డీసీసీబీ ఎన్నికలకు వేళాయే..!

మళ్లీ ఎన్నికల సందడి వచ్చింది. ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గాల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో జిల్లా సహకార సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ అడిషనల్ రిజిస్ట్రార్ గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు.
- 22న జిల్లాల వారీగా నోటిఫికేషన్
- 25న నామినేషన్ల స్వీకరణ, స్క్రూట్నీ, ఉపసంహరణలు
- 28న పోలింగ్, ఫలితాల వెల్లడి g 29న పాలకవర్గాల ఎన్నిక
- డీసీసీబీ, డీసీఎంఎస్ రెండూ టీఆర్ఎస్వే..
- అభ్యర్థులెవరనే అంశంపైనే ఉత్కంఠ
మహబూబ్ నగర్ నమస్తే తెలంగాణ, ప్రధాన ప్రతినిధి: మళ్లీ ఎన్నికల సందడి వచ్చింది. ప్రాథమిక సహకార సంఘాల పాలకవర్గాల ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో జిల్లా సహకార సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ అడిషనల్ రిజిస్ట్రార్ గురువారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 22న జిల్లా సహకార అధికారి ఎన్నికల నోటీసు జారీ చేయనున్నారు. ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణ, స్క్రూటినీ, ఉపసంహరణలుంటాయి. ఈ నెల 28న పోలింగ్, అదే రోజు ఫలితాలు సైతం వెల్లడిస్తారు. మరుసటి రోజు పాలవర్గాల ఎన్నికలు జరుగుతాయి. మహబూబ్ నగర్ జిల్లా సహకార సంఘం పరిధిలోని 87 సహకార సంఘాల ఎన్నికలు పూర్తయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తరుణంలో జిల్లా సహకార ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది.
ఈ నెల 28న ఎన్నికలు..
జిల్లా సహకార సంఘాల ఎన్నికలకు సహకార అధికారి ఈ నెల 22న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 25న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 3గంటల వరకు స్క్రూటినీ, మ ధ్యాహ్నం 3:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపసంహరణలకు అవకాశం ఉంటుంది. 28న ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. పోలింగ్ అయిన వెంటనే కౌంటిం గ్ ప్రారంభిస్తారు. కౌంటింగ్ ముగిసిన వెంటనే ఫలితాలు ప్రకటిస్తారు. ఈ నెల 29న డీసీసీబీ, డీసీఎంస్ పాలక వర్గాల ఎన్నికలు జరుగుతాయి.
డీసీసీబీ, డీసీఎంఎస్ పాలకవర్గాల కోసం..
డీసీసీబీకి సంబంధించి 20 మంది డైరెక్టర్ల కోసం ఎన్నికలు నిర్వహిస్తారు. ఇందులో ఎ క్యాటగిరీ (ప్రాథమిక సహకార సంఘాలు) నుంచి 16 మంది బి క్యాటగిరీ (ఇతర సంఘాలు) నుంచి నలుగురు డైరెక్టర్లుగా ఎన్నికవుతారు. ఎ క్యాటగిరీలో ఎస్సీలకు 3, ఎస్టీలకు 1, బీసీలకు 2, జనరల్ 10 డైరెక్టర్ స్థానాలు కేటాయించారు. ఇక బి క్యాటగిరీలో ఎస్సీ 1, ఎస్టీ 1, బీసీ 1, జనరల్ 1 స్థానాల ను కేటాయించారు. ఎన్నికైన 20 మంది డైరెక్టర్లు డీసీసీబీ చైర్మన్, వైస్ చైర్మన్లను ఎన్నుకుంటారు.
క్యాటగిరీ వారీగా బ్యాలెట్ పేపర్లు..
రిజర్వేషన్ క్యాటగిరీల వారీగా బ్యాలెట్ పేపర్ల గుర్తులను కేటాయించారు. ఎస్సీ పింక్, ఎస్టీ లైట్ బ్లూ, బీసీ లైట్ గ్రీన్, జనరల్ కేటగిరీకి వైట్ బ్యాలెట్ పేపర్లుంటాయి. మహబూబ్ నగర్ జిల్లా సహకార సంఘం పరిధిలో 87 పీఏసీఎస్‌లు ఉండగా.. గురువారం వరకు వనపర్తి జిల్లా నాగవరం పీఏసీఎస్ పాలకవర్గం మినహా అన్నింటా ఎన్నికలు పూర్తయ్యాయి. ఇక బి క్యాటగిరీలో జిల్లాలో 35 మంది ఓటర్లున్నారు. వీరు నలుగురు డైరెక్టర్లను ఎన్నుకుంటారు.
డీసీసీబీ, డీసీఎంస్ రెండూ కారుకే..
పార్టీలకు అతీతంగా ఎన్నికలు జరిగినా మహబూబ్ నగర్ జిల్లా సహకార సంఘం పరిధిలోని 87 స్థానాల్లో టీఆర్ఎస్ 83 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 87 స్థానాల నుంచి 16 మంది డైరెక్టర్లను ఎంపిక చేయాల్సి ఉంది. అంటే ఏ విధంగా చూసిన టీఆర్ఎస్కు పోటీ ఇచ్చే ప్రత్యమ్నాయం లేదు. కాబట్టి డీసీసీబీ, డీసీఎంస్ రెండు అధికార పార్టీ ఖాతాలోనే పడతాయి. దీంతో డీసీసీబీ, డీసీఎంస్ డైరెక్టర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక లాంఛనంగానే జరుగనుంది. చైర్మన్, వైస్ చైర్మన్ అభ్యర్థులెవరనే అంశంపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. పలువురు నేతల పేర్లు వినిపిస్తున్నా పార్టీ అధిష్ఠానం ప్రకటించిన తర్వాతే క్లారిటీ వస్తుంది.
ఎన్నికలకు సిద్ధం
జిల్లా సహకార సంఘా ల డైరెక్టర్లు, పాలక వర్గాల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు ఈ నెల 22న స్థానికంగా ఎన్నికల నిర్వహణ కోసం మేం నోటీఫికేషన్ ఇస్తాం. జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాం. అదే రీతిన డీసీసీబీ, డీసీఎంస్ ఎన్నికలు సైతం విజయవంతంగా నిర్వహిస్తాం.
- రాజేందర్ రెడ్డి, జిల్లా సహకార అధికారి
తాజావార్తలు
- సాయి ధరమ్ తేజ్‌తో సుకుమార్ సినిమా
- సుంకాల పెంపుతో పెట్రోల్ భారం రూ.4.21 లక్షల కోట్లు?!
- మూడో వారంలోనూ ‘ఉప్పెన’లా కలెక్షన్స్
- హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీని కలిసిన సీఎం కేసీఆర్
- ‘లోన్ వరాటు’కి వ్యతిరేకంగా మావోయిస్టుల కరపత్రం?
- మహేష్ బాబు టైటిల్ తో ప్రభాస్ సినిమా
- 13 మంది ట్రాన్స్‌జెండర్స్ కానిస్టేబుల్స్‌గా నియామకం
- రామ్ చరణ్ ‘సిద్ధ’మవుతున్నాడట..!
- ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని యువతి ఆత్మహత్య
- వాణీదేవి గెలుపు ఖాయం : మంత్రులు