శుక్రవారం 05 జూన్ 2020
Narayanpet - Feb 19, 2020 , 00:25:21

ఆశల జొన్న

ఆశల జొన్న

యాసంగిలో వరి, వేరుశనగతోపాటు జొన్న పంటనూ సాగు చేయడం జిల్లా ప్రత్యేకత. తక్కువ పెట్టుబడి ఖర్చుతో దిగుబడి బాగా వస్తుండటం.. మార్కెట్‌లో డిమాండ్‌ ఉండటంతో అన్నదాతలు జొన్న సాగుకు ఆసక్తి చూపుతున్నారు. మల్‌దండి రకం విత్తనాలను అధికంగా వేశారు.

  • జిల్లాలో 1,859 ఎకరాల్లో సాగు
  • అనుకూలించిన నేలలు
  • కళకళలాడుతున్న పంటలు
  • అత్యధికంగా దామరగిద్ద.. ఊట్కూర్‌ మండలాల్లో
  • మార్కెట్‌లో భలే డిమాండ్‌

యాసంగిలో వరి, వేరుశనగతోపాటు జొన్న పంటనూ సాగు చేయడం జిల్లా ప్రత్యేకత. తక్కువ పెట్టుబడి ఖర్చుతో దిగుబడి బాగా వస్తుండటం.. మార్కెట్‌లో డిమాండ్‌ ఉండటంతో అన్నదాతలు జొన్న సాగుకు ఆసక్తి చూపుతున్నారు. మల్‌దండి రకం విత్తనాలను అధికంగా వేశారు. ఇవి ఇక్కడి నల్లరేగడి నేలల్లో ఉండే తేమ, వాతావారణం, తెగుళ్లను తట్టుకొని మంచి దిగుబడిని ఇస్తాయి. జిల్లాలో 1,859 ఎకరాలల్లో జొన్న సాగు చేయగా.. అత్యధికంగా దామరగిద్ద, ఊట్కూరు మండలాల్లో సాగైంది. మరో పది రోజుల్లో పంట చేతికి అందనుండటంతో పైర్లు కళకళలాడుతున్నాయి. 


నారాయణపేట ప్రతినిధి/నమస్తే తెలంగాణ : వర్షాకాలంలో అన్ని రకాల పొలాల్లో వివిధ రకాల పంటలను సాగు చేయడం సాధారణం. కానీ యాసంగిలో ప్రధానంగా వరి, వేరుశనగ, ఇతర ఆరుతడి పంటలను సాగు చేస్తారు. కానీ నారాయణపేట జిల్లాలో ఈ పంటలతో పాటు జొన్నను కూడా సాగు చేశారు. ఈ పంటతో మంచి దిగుబడి వస్తుండటంతో అన్నదాతలు ఆసక్తి చూపుతున్నారు. ఈ సంవత్సరం కుడా రైతులు పెద్దమొత్తంలో జొన్న పంటను సాగు చేశారు. మరో 10 రోజుల్లో పంట చేతికి రానున్నది. 


అనుకూలిస్తున్న నేలలు..

జిల్లాలోని పలు మండలాల్లో నేలల రకాలు, వాతావరణం జొన్న సాగుకు అనుకూలిస్తున్నా యి. నల్లరేగడి నేలలు, వర్షాకాలంలో కురిసిన వర్షపు నీటిని ఎక్కువగా గ్రహించడం, సాగు చేసిన జొన్న చేనుకు అవసరమైన స్థాయిలో తేమను అందిస్తుంది. దీనికి తోడు ఆడపా దడపా కురిసే వర్షం కూడా ఈ పంటకు ఎంతో ఉపయోగపడుతుంది. చలి కాలంలో ఎక్కువగా కురుస్తున్న మం చుతో ఈ పంట ఏపుగా పెరిగింది. నీటి అవసరాలు తక్కువగా ఉన్న కారణంగా జొన్న ఈ జిల్లాలో యాసంగి పంట గా రైతులకు ఎంతో మేలు చేస్తుంది. 


మల్‌దండి రకం విత్తనాలే అనుకూలం

జిల్లాలో యాసంగిలో ప్రతి ఏటా సాగు చేసే జొ న్న కోసం రైతులు మల్‌దండి రకం విత్తనాలను ఉపయోగిస్తారు. ఈ రకం విత్తనాలతో పెరిగిన చే ళ్లు నల్లరేగడి నేలల్లో ఉండే తేమ, వాతావారణం, రోగ నిరోధక శక్తి కలిగి ఉండి మంచి దిగుబడి ఇ స్తుంది. 95నుంచి 105 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 


మండలాల వారీగా సాగు వివరాలు

జిల్లాలోని అన్ని మండలాల్లో రైతులు జొన్న పంటను 1,859 ఎకరాల్లో సాగు చేశారు. అత్యధికంగా దామరగిద్ద మండలంలో 754 ఎకరాల్లో సాగు చేయగా. ఊట్కూర్‌లో 450 ఎకరాలు, నా రాయణపేట మండలంలో 450 ఎకరాల చొప్పు న రైతులు జొన్న పంటను సాగు చేశారు. మక్తల్‌ లో 65 ఎకరాలు, మగనూర్‌లో 50, కృష్ణలో 55, కోస్గిలో 15 ఎకరాలు, మద్దూర్‌లో 20 ఎకరాలలో రైతులు జొన్న పంటను సాగు చేశారు. నర్వ, మరికల్‌, ధన్వాడ మండలాల్లోని పొలాలన్నీ వరి పంటకు అనుకూలంగా ఉండడంతో రైతులు ఈ పంట సాగుకు ఆసక్తి చూపలేదు. 


జొన్నకు భలే డిమాండ్‌

యాసంగిలో పండించే జొన్నకు మంచి డి మాండ్‌ ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపా టు జిల్లాలోని ఆయా ప్రాంతాలు, హైదరాబాద్‌, రాయిచూర్‌కు చెందిన ప్రజలు జిల్లాకు వచ్చి యాసంగిలో పండిన జొన్నను కొనుగోలు చేస్తా రు. మరి కొందరు మార్కెట్‌లో విక్రయిస్తారు. జొన్న రొట్టెలు ఆరోగ్యానికి మంచివి కావడంతో కొన్నేళ్లుగా మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. క్వింటాలుకు రూ.4 వేల నుంచి రూ. 4,500 ధర పలుకుతుంది. యాసంగిలో వచ్చిన జొన్నలకు ఇంకా మంచి ధర లభించే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 


logo