బుధవారం 03 జూన్ 2020
Narayanpet - Feb 19, 2020 , 00:15:16

వైద్య సేవలు మెరుగ్గా ఉండాలి

వైద్య సేవలు మెరుగ్గా ఉండాలి

వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ యోగితా రాణా జిల్లా దవాఖాన వైద్యు లు, సిబ్బందిని ఆదేశించారు. మంగళ వారం సాయంత్రం ఆమె జిల్లా దవాఖానను తనిఖీ చేశారు.

  • ప్రతి రోగిపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి
  • నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
  • మరమ్మతులకు ప్రతిపాదనలు పంపండి
  • రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌ యోగితా రాణా
  • జిల్లా దవాఖాన పరిశీలన.. నిర్వహణపై ఆగ్రహం

నారాయణ పేట ప్రతినిధి/నమస్తే తెలంగాణ : వైద్యం కోసం వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని రాష్ట్ర  వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ యోగితా రాణా జిల్లా దవాఖాన వైద్యు లు, సిబ్బందిని ఆదేశించారు. మంగళ వారం సాయంత్రం ఆమె జిల్లా దవాఖానను తనిఖీ చేశారు. ముందుగా ఆమెకు దవాఖాన సూపరింటెండెంట్‌ మల్లికార్జున్‌ సిబ్బందితో కలిసి ఆమె స్వాగతం పలికారు. అనంతరం ఆమె వైద్య సిబ్బందితో కలిసి దవాఖాన పరిసరాల ను పరిశీలించారు. దవాఖానలో పలు చోట్ల అపరిశుభ్రంగా ఉండడం, ఆవరణలో మురుగునీరు నిలిచి ఉండడాన్ని చూసి ఆమె అసహనం వ్యక్తం చేశారు. మీరు నిర్వహంచే ప్రైవేట్‌ దవాఖానలను ఇలాగే అపరిశుభ్రంగా ఉంచుతారా అని వైద్యులను ప్రశ్నించారు. అ నంతరం ఆమె నేరుగా దవాఖాన భవ నం అంతా కలియ దిరిగి పరిశీలించా రు. ల్యాబ్‌, కాన్పుల వార్డు, ఆపరేషన్‌ థియేటర్‌, పలు వార్డులను తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆమె వైద్య సేవలు పొందుతున్న రోగులను పలుకరించి మాట్లాడి వారి కే షీట్లను పరిశీలించారు. అయితే వైద్య సిబ్బంది కొంత స మయపాలన పాటించడం లేదని తెలిసి ఆమె సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. దవాఖానకు వచ్చే ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది దవాఖానలో చేపట్టాల్సిన మరమ్మతు పనులను ఆమె దృష్టికి తీసుకుపోయారు. 

అనంతరం ఆమె వైద్య సి బ్బందితో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి రోజు దవాఖానకు వస్తున్న వారి సంఖ్య, వైద్యులు, సిబ్బం ది తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం ప్రజలకు మెరుగైన   వైద్యసేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. సేవలు అందిం చే విషయంలో నిర్లక్ష్యం వీడాలని సిబ్బందికి సూచించారు. దవాఖానలో మరమ్మతులు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూపరింటెండెంట్‌ను ఆదేశించారు. 


గ్రామాలలో పారిశుధ్యం మరింత మెరుగుపడాలి

కృష్ణ : గ్రామాలలో పారిశుధ్యం మ రింత మెరుగుపడాల్సిన అవసరం ఉం దని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ యోగితారాణా, జెడ్పీ సీఈవో కాళింది ని అన్నారు. మంగళవారం డీపీవో ము రళితో కలిసి వారు మండలంలోని గురజాల, తంగిడి, కుసుమర్తి గ్రామాలలో పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో నిర్మిస్తున్న డం పింగ్‌ యార్డు, శ్మశాన వాటికల నిర్మాణాలు, నర్సిరీల పెంపకాన్ని పరిశీలించారు. అనంతరం గ్రామాల్లో  ము రుగుకాలువలను పరిశీలించి గ్రామాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వందశాతం ఫలితాలు రాబట్టేందుకు గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి దిద్దుబాటు చర్యలు చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. వారి వెంట ఎంపీడీవో శ్రీ నివాసులు, తాసిల్దార్‌ రాజ్‌గణేశ్‌, ఏపీ వో యతిరాజ్‌, సర్పంచులు గుండురా వు కులకర్ణి, రేణుక మోనేశ్‌, పంచాయ తీ కార్యదర్శి స్వామినాథ్‌ ఉన్నారు.  


logo