పోరు నేడే

నాగర్‌కర్నూల్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : సహకార సమరం పరిసమాప్తి కానుంది. గత పది రోజులుగా జరుగుతున్న ఎన్నికల వేడి శనివారం పోలింగ్‌తో పూర్తి కానున్నాయి. జిల్లాలోని 23విండోలకు ఒక విండో ఏకగ్రీవం కాగా 22 విండోల పరిధిలోని 246వార్డులకు జరిగే ఈ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. 33పోలింగ్ కేంద్రాల్లో 91వేల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిర్వహిం చి మధ్యాహ్నమే ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితంగా సహకార ఎన్నికల్లో బరిలో నిలిచిన 554మంది అభ్యర్థుల భవితవ్యం తే లనుంది. రాజకీయ పార్టీలు, ఆశావహుల్లోనూ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.
నేడే పోలింగ్..
జిల్లాలోని 23సహకార సంఘాలకు గాను తిమ్మాజిపేట(గొరిట) విండో ఏకగ్రీవమైంది. ఇక్కడ 13వార్డుల్లోని డైరెక్టర్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. 22విండోల పరిధిలోని 246వార్డులకు జరిగే ఎన్నికల్లో 1179నామినేషన్లు రాగా తిరస్కరణ, ఉపసంహరణతో 554మంది పోటీలో నిలిచారు. అభ్యర్థులు గత నాలుగు రోజులుగా గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇండ్ల వద్ద, పొలాల గట్లకు వెళ్లి తమకు కేటాయించిన గుర్తులను చూపిస్తూ గెలిపిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో చెప్తూ ఓట్లను అభ్యర్థించారు. ఈ ఎన్నికలు పార్టీ గుర్తులతో కాకుండా పంచాయతీ ఎన్నికల మాదిరి స్వతంత్రంగా బ్యాలెట్ పద్ధతిలో జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార టీఆర్ఎస్ మరోసారి తన హవాను కొనసాగించేలా ఉండగా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోసం ప్రయత్నించాయి. ఇక పార్టీ మద్దతు లేకుండా పోటీ చేస్తున్న అభ్యర్థులు అతి తక్కువ స్థానాల్లో జరిగే ఎన్నికలు కావడంతో గెలిస్తే కీలకం కావచ్చన్న ఆశతో బరిలో నిలిచారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు పోలింగ్. అదే రోజు మధ్యాహ్నం 3గంటల నుంచి ఓట్లను లెక్కించి ఆ వెంటనే ఫలితాలను ప్రకటించనున్నారు. దీంతో రాజకీయ పార్టీలతో పాటుగా బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. అధికారులు సైతం ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శుక్రవారం జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు పంపిణీ చేశారు. ఎన్నికల్లో 897మంది పాల్గొననున్నారు. 33ప్రభుత్వ పాఠశాలల్లో పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. సొసైటీలు ఉన్న గ్రామంలోనే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి సంఘానికి ఒక జిల్లా అధికారిని పర్యవేక్షణాధికారిగా నియమించారు. ఒక పోలింగ్ కేంద్ర ఏజెంట్‌గా ఉన్న వ్యక్తి మరో కేంద్రంలోకి అనుమతి ఉండదు. ఇక్కడ ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేపట్టారు. డీఆర్వో మధుసూదన్ నాయక్ శుక్రవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలోని బూత్‌ను పరిశీలించారు. ఈ ఎన్నికల్లో మొత్తం ఓటర్లు 91,421 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 67,149 మంది కాగా మహిళలు 24,272మంది ఉన్నారు. ఇలా ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేయడంతో సహకార ఎన్నికల ప్రక్రియ శనివారంతో ముగియనుంది. విజేతలను ప్రకటించి సర్టిఫికెట్లను అందజేస్తారు. ఇక ఆదివారం విండో చైర్మన్, వైస్చైర్మన్ల ఎన్నిక ఉంటుంది. విండో డైరెక్టర్ స్థానాలకు రిజర్వేషన్ల వర్తించనుండగా చైర్మన్ అభ్యర్థిని మెజార్టీ ప్రాతిపదికన డైరెక్టర్లు ఎన్నుకుంటారు. సహకారసంఘాల ఎన్నిక రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు, నాయకుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి..
జిల్లాలోని 22విండోల పరిధిలోని 246డైరెక్టర్ల పదవులకు శనివారం ఎన్నికలు జరుగుతాయి. జిల్లాలో 33పోలింగ్ బూత్‌లను సిద్ధం చేశాం. దాదాపు 900మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మధ్యాహ్నం 3గంటల నుంచి లెక్కింపు ప్రారంభించి వెంటనే ఫలితాలను ప్రకటించడం జరుగుతుంది.
- శ్రీరామ్, జిల్లా సహకార అధికారి
తాజావార్తలు
- స్పీకర్ నియామకంలో సర్కారు వైఫల్యం: దేవేంద్ర ఫడ్నవీస్
- రైతుల నిరసన : ‘ఈసారి బారికేడ్లు పెడితే బద్దలుకొడతాం’
- పవన్-రానా సినిమా ఫొటో లీక్.. షాక్‌లో నిర్మాతలు
- ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి
- త్వరలో టీటీడీ నుంచి గో ఉత్పత్తులు : ఈఓ
- సుశాంత్ కేసులో 12వేల పేజీల చార్జిషీట్ సమర్పించిన ఎన్సీబీ
- శర్వానంద్‌కు టాలీవుడ్ స్టార్స్ సాయం...!
- గోల్డ్ స్మగ్లింగ్ కేసు : సంచలన విషయాలు వెల్లడించిన స్వప్నా సురేష్!
- ఐసీఐసీఐ హోమ్‌లోన్‌పై తగ్గిన వడ్డీరేటు.. పదేళ్లలో ఇదే తక్కువ
- ద్వారకాలో కార్తికేయ 2 చిత్రీకరణ..!