శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 15, 2020 , 00:24:34

అమర జవాన్లకు ఘన నివాళి

అమర జవాన్లకు ఘన నివాళి

నారాయణపేట, నమస్తే తెలంగాణ : గత ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన పూల్వామాదాడిలో అమరులైన జవానులకు పట్టణ బజరంగ్‌దళ్‌ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. స్థానిక సత్యనారాయణ చౌరస్తాలో రెండు ని ముషాల పాటు మౌనం పాటించి ఘనం గా నివాళులర్పించి, జవాన్‌లకు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశా రు. ఈ సందర్భంగా బజరంగ్‌దళ్‌ పట్టణ అధ్యక్షులు రవికుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ దొంగచాటున ముష్కరులు మన దేశ జవానులపై దాడికి పాల్పడడం వల్ల అనేక మంది జవానులు ప్రాణాలు కోల్పోవడమే కాకుండా మరేంతో మంది క్షతగాత్రులయ్యారన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరజవానుల కుటుంబాలకు దేవుడు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ప్రార్థించామన్నారు. ఈ కార్యక్రమంలో బజరంగ్‌దళ్‌ పట్టణ శాఖ సభ్యులు వెంకటేశ్‌గౌడ్‌, చిన్నరఘు, శ్రీకాంత్‌, కిరణ్‌, హరీష్‌, అనిల్‌ పాల్గొన్నారు.

విద్యార్థుల నివాళులు

నారాయణపేటరూరల్‌ : పూల్వా మా ఉగ్రదాడిలో వీరమరణం చెందిన జవానులకు పట్టణంలోని హం సవాహాని ఉన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం నివాళులర్పించారు. అలాగే పట్టణంలోని లిటిల్‌ స్టార్స్‌ హైస్కూల్‌లో, కృష్ణ గోకులం పాఠశాలలో ప్రార్థన సమయంలో విద్యార్థులు వీరజవానుల స్మారకార్థం మౌనం పా టించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరికల్‌లో.. 

మరికల్‌ : పూల్వామా దాడిలో అమరులైన అమరవీరులకు మరికల్‌ బాలికల, బాలుర పాఠశాలలో శుక్రవారం విద్యార్థులు శ్రద్దాంజలి ఘటించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు శ్రద్దాంజలి ఘటించి, నివాళులర్పించారు. అదే విధంగా విద్యార్థులు గ్రామంలో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వ హించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు రాజేశ్‌, అనిల్‌, జానకి రాము లు, చెన్నయ్య, మోహన్‌ పాల్గొన్నారు. 

మద్దూర్‌లో.. 

మద్దూరు : మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం పాఠశాల ఆవరణలో విద్యార్థులు పుల్వామా దాడిలో మృతి చెందిన సైనికలకు నివాళులర్పించి, జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం నేను దేశం కోసం నిలబడతా అంటు ప్రతిజ్ణ చేశారు. మండల ఫొటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గీతాంజలి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సైనికుల సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఫొటోగ్రాఫర్ల సంఘం నాయకులు మధుకర్‌, ఎంపీటీసీ సిపిరి వెంకటయ్య, ఉపాధ్యాయులు విజయ్‌కుమార్‌, వెంకటయ్య, మహేశ్‌ పాల్గొన్నారు.

కోస్గిలో..

కోస్గి : పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు కోస్గిలో టీఆర్‌ఎస్‌ నాయకులు నివాళులర్పించారు. శుక్రవారం కోస్గి శివాజీ చౌరస్తాలో వారి వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ ఎం శిరీష రాజేశ్‌, జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు ఓం ప్రకాశ్‌, జగదీశ్వర్‌రెడ్డి, మహేశ్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

దామరగిద్దలో..

దామరిద్ద : మల్‌రెడ్డిపల్లి గ్రామంలో పుల్వామా దాడిలో అమరులైన వీర జవాన్లకు విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. అంతకు ముందు జాతీయ జెం డాతో అమరవీరుల త్యాగాలను స్మరి స్తూ ర్యాలీ చేపట్టారు. 

కొవ్వొత్తులతో  ప్రదర్శన

ధన్వాడ : మండల కేంద్రమైన ధన్వాడలో యువకులు శుక్రవారం రాత్రి అ మరజవాన్లకు నివాళులర్పించారు. అం తకు ముందు గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

VIDEOS

logo