శనివారం 27 ఫిబ్రవరి 2021
Narayanpet - Feb 15, 2020 , 00:23:59

పోలీసు సురక్షాపై విద్యార్థులకు అవగాహన

పోలీసు సురక్షాపై విద్యార్థులకు  అవగాహన

మహబూబ్‌నగర్‌ క్రైం: మనలోని క్రమశిక్షణ, మన ఎదుగుదలకు మూలమై ఉన్నత స్థాయికి చేరుకునేలా చదువుకోవాలని ఎస్పీ రెమా రాజేశ్వరి సందేశాన్ని విద్యార్థుల ముందుకు తెచ్చేందుకు జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లు, గ్రామాలను సందర్శిస్తూ పోలీసు శాఖ ఆధ్వర్యంలో సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ కార్యాలయం పీఆర్‌వో రంగినేని మన్మోహన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మావతీకాలనీ ఎస్సీ సంక్షేమ హాస్టల్‌లో శుక్రవారం రాత్రి పోలీసు సురక్షా కళా బృందం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి సమాజంలో ప్రధాన భూమిక పోషించే విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు పాఠశాలను వేదిక చేసుకోవాలన్నారు. విద్యార్థులలో స్ఫూర్తి నింపేందుకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు గట్టిగా కృషిచేయాలని సురక్షా కళాబృందం సభ్యులకు ఎస్పీ తగిన సూచనలు ఇచ్చారని తెలిపారు. మనలోని పేదరికాన్ని తొలగించుకునేందుకు పెద్దగా చదివి జ్ఞానాన్ని సంపాదించడమే లక్ష్యంగా విద్యార్థులుకృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా సురక్షా కళా బృందం రాములు, జగదీశ్‌, నర్సింహ, రాములు, శ్రీనివాసు, శివరాములు ఆటాపాటలతో విద్యార్థులకు స్ఫూర్తి నింపారు. కార్యక్రమంలో రిటైర్డ్‌ డీఈవో విజయ్‌కుమార్‌, హాస్టల్‌ వార్డెన్‌ శివకుమార్‌, హెచ్‌ఎం శైలజ, రూరల్‌ ఏఎస్సై కృష్ణయ్య, కాలనీపెద్దలు పలువురు పాల్గొన్నారు.

VIDEOS

logo