మంగళవారం 20 అక్టోబర్ 2020
Narayanpet - Feb 15, 2020 , 00:22:29

‘పది’లో వందశాతం ఫలితాలు సాధించాలి

‘పది’లో వందశాతం ఫలితాలు సాధించాలి

భూత్పూర్‌: పదో తరగతిలో విద్యార్థులు వందశాతం ఫలతాలను సాధించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఉషారాణి కోరారు. శుక్రవారం ఆమె మండలంలోని కేజీబీవీ పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్‌ డిక్షనరీలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎందులోను తక్కువ కాదని వాళ్లకు అవసరమైన సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. కేజీబీవీ పాఠశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్‌జేడీ ఇంగ్లీష్‌ డిక్షనరీలను తయారు చేయించారని తెలిపారు. అదేవిధంగా ప్రతి రోజూ ప్రత్యేక తరగతులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం ఆమె విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి ఎస్‌వో శ్రీదేవి, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


logo