బుధవారం 03 మార్చి 2021
Narayanpet - Feb 14, 2020 , 00:59:24

ముగిసిన ప్రచారం

ముగిసిన ప్రచారం

నారాయణ పేటప్రతినిధి,నమస్తే తెలంగాణ : జిల్లా లో సింగిల్‌ విండో ఎన్నికల ప్రచారం గురువారం సా యంత్రంతో ముగిసింది. రంగంలో ఉన్న అభ్యర్థులు, ఆయా పార్టీల నాయకులు సమయం ముగియగానే బహిరంగ ప్రచారాలను నిలిపేసి ఒంటరిగా ఓటర్లను కలిసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ఒక్కరోజే అవకాశం ఉండడంతో అభ్యర్థులు ఓటర్ల మద్దతును కూడ గట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న మొన్నటిదాక జోరుగా సాగిన ప్రచార సందడి గురువారం ముగియడంతో గ్రామాలు ప్రశాంతంగా మారాయి. మరో వైపు ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికలు జరిగే తొమ్మిది సింగిల్‌విండోల పరిధిలో పోలింగ్‌ కేంద్రాలుగా ఏర్పాటు చేసిన పాఠశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు.

ఒంటరిగా ఓట్లడుగుతూ..

ఎన్నికల ప్రచారం ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను స్వయంగా కలుస్తూ తోచిన రీతులలో ఓట్లు అడుగుతున్నారు. ఓటర్లను మెప్పించేందుకు రకరకాల జిమ్మిక్కులు ప్రారంభించారు. జిల్లాలో మొత్తం 10 సింగిల్‌ విండోలకు ఎన్నికలు జరుగాల్సి ఉండగా మరికల్‌ మండలంలోని తీలేరు సింగిల్‌ విండోకు సంబంధించిన 13 డైరెక్టర్‌ స్థానాలు ఏకగ్రీవం కావడంతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేకుండాపోయింది. జిల్లాలోని మరో 30 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు ఏకగ్రీవం కావడంతో 87 డైరెక్టర్‌ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రంగంలో ఉన్న 193 మంది అభ్యర్థులు ఎవరికి వారుగా ప్రచాలు చేశారు. శుక్రవారం వరకు అభ్యర్థులు ఓటర్లను మెప్పించేందుకు తమతమ ప్రయత్నాలు మరింత తీవ్రం చేశారు.

పోలింగ్‌ కేంద్రాలున్న పాఠశాలలకు 

నేడు, రేపు సెలవులు

సింగిల్‌ విండో ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు జిల్లావ్యాప్తంగా మొత్తం ఆయా మండలాల పరిధిలో ఉన్న 14పాఠశాలల్లో 87 పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేశారు. నారాయణపేటలోని బాలికల ఉన్న త పాఠశాల, దామరగిద్దలోని జిల్లాపరిషత్‌ ఉన్నత పాఠశాల, మద్దూరులోని జిల్లా పరిషత్‌ బాలురు, బాలికల పాఠశాలలు, ఊట్కూరులోని జిల్లాపరిషత్‌ బాలు రు, బాలికల పాఠశాల, ధన్వాడలోని జెడ్పీ హైస్కూల్‌, నర్వలో జెడ్పీహైస్కూల్‌,  మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల, జెడ్పీహెచ్‌ఎస్‌ మక్తల్‌, జెడ్పీహెచ్‌ఎస్‌ మాగనూరు, తీలేరులోని ప్రాథమిక పాఠశాలో పోలింగ్‌ కేం ద్రాలను ఏర్పాటు చేశారు. 14,15 తేదీలలో అధికారులు సెలవు ప్రకటించారు.

అధికారులతో సమీక్షా సమావేశం 

 సింగిల్‌ విండో ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించే లక్ష్యంతో కలెక్టర్‌ హరి చందన గురువారం ఆయా మండలాల ఎంపీడీవోలు, తాసిల్దార్లతో ప్రత్యేక సమావేశం జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ హరిచందన మాట్లాడుతూ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితాలు, స్లిప్పులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో ఏఎన్‌ఎంను నియమించుకోవాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి 200 మీ.దూరంలో బారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్‌ కేంద్రాలలో ఇతర మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. ఎస్పీ డాక్టర్‌ చేతన మాట్లాడుతూ పోలింగ్‌ స్టేషన్ల వద్ద బందో బస్తు ను నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. సమస్యాత్మక కేంద్రాలలో అదనపు సిబ్బందిని నియమిస్తామన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రం వద్ద144 సెక్షన్‌ అమలులో ఉంటుందని ఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోవపరేటివ్‌ అధికారి వీరభద్రయ్య, డీఎస్పీ మధుసూదన్‌రావ్‌ పాల్గొన్నారు.

VIDEOS

logo